Kantara Chapter1 pre release: ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని భాషలలోనూ భారీ స్థాయిలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) ఒకటి. కన్నడ నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ రెండో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 28వ తేదీ 5 గంటలకు హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ లో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR)ముఖ్యఅతిథిగా హాజరు హాజరు కాబోతున్నారు. ఇక ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు.
ఇలా రిషబ్ శెట్టి కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారన్న విషయం తెలియడంతో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఏర్పడనున్నాయి. ఇక రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ మధ్య చాలా మంచి స్నేహబంధం ఉన్న నేపథ్యంలో రిషబ్ శెట్టి కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఇక కాంతార సినిమా విషయానికి వస్తే ఇదివరకు కాంతార సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా కాంతార చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాని హోంభళే నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలో ఈయనకు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)నటించి సందడి చేయబోతున్నారు.
కాంతార సినిమా కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భూత కోలా నృత్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. తాజాగా ట్రైలర్ మాత్రం భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక నేటినుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో భారీ స్థాయిలోనే ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందని చెప్పాలి.. ఇక ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమాలో రిషబ్ నటనకు కూడా ఏకంగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: Sai Pallavi Bikini: బికినీ ఫోటోలపై రియాక్ట్ అయిన సాయి పల్లవి. నిజంగా తీసినవే అంటూ!