BigTV English

Japam:ఏ జపం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?

Japam:ఏ జపం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?

Japam:జపం కూడా చేసే విధానాన్ని బట్టి దాని పలితాన్ని ఇస్తుంది. అందరికీ అనుకూలమైన ప్రాంతం ఇల్లు. ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక భారతీయ సాంప్రదాయంలో నదులు ఒక భాగం. వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు భారతీయులు. అలాంటి నదిలో చేసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దేవతా స్వరూపంగా చూసే జంతువులలో ఆవు ఎంతో గొప్పది. అలాంటి ఆవుల నిలయమైన గోశాలలో జపం వందరెట్లు పలితాన్ని ఇస్తుంది. యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది .


కొయ్యపీటపై కూర్చుని జపం చేస్తే దౌర్భాగ్యము కలుగుతుంది. గడ్డితో చేసిన చాపపై కుర్చీని జపం చేస్తే చిత్తచాపల్యము కలుగుతాయి. అంటే మనసు నిలకడగా ఉండదు. జింక చర్మము పై కూర్చుని చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చాలామంది యోగులు, సన్యాసులు దీనిపైనే జపం చేస్తారు. పులి తోలుపై కూర్చుని జపం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది. ఎంతో గొప్ప మహర్షులు పులిచర్మం పై జపం చేస్తారు.వస్త్రాన్నీ పరచుకుని దానిమీద కూర్చుని జపం చేస్తే డబ్బు సమకూరి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి

దేవుళ్ళు స్వయంభువు గానూ, ప్రతిష్టగానూ కొలువై ఉన్న పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధిలోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అన్నింటికీ మించి ఆ పరమేశ్వరుడి సన్నిధి అంటే శివాలయంలో జపం చెస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జపాన్ని కూడా వివిధ రకాలుగా అంటే వివిధ అసనాలలో చేయడం వల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి.


వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యము సంభవిష్తుంది కాబట్టి ఎప్పుడూ ఇలా చేయకూడదు. రాతిపై కూర్చుని చేస్తే రోగాలు వస్తాయని అంటారు. అందుకే రాతిమీద కూర్చుని చేయకూడదు. నేలపై కూర్చుని చేస్తే దుఃఖము కలుగుతుంది. దుఃఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేయాలి. అలాగే దర్భలతో చేసిన ఆసనంపై కూర్చుని జపము చేసినా పుష్టిని కలిగిస్తుంది.

Vastu:ఆర్టిఫిషయల్ గ్రాస్ గురించి వాస్తులో ఉందా.

Vadi Biyyam:వడి బియ్యం …ఎందుకు

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×