BigTV English

OTT Movie : అమ్మాయిలనే ముట్టుకోని ఆణిముత్యం… ఆటిజం ఉన్నా అదిరిపోయే ట్రీట్మెంట్ చేసే డాక్టర్… ఒక్కో కేసులో ఒక్కో అద్భుతం

OTT Movie : అమ్మాయిలనే ముట్టుకోని ఆణిముత్యం… ఆటిజం ఉన్నా అదిరిపోయే ట్రీట్మెంట్ చేసే డాక్టర్… ఒక్కో కేసులో ఒక్కో అద్భుతం

OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జానర్లలో వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ 7 సీజన్లు, 137 ఎపిసోడ్‌లతో, IMDbలో 8.0/10 రేటింగ్ తో నడుస్తోంది. ఈ సిరీస్ ఒక డాక్టర్ చుట్టూ తిరుగుతుంది. ప్రతి సీజన్ ఆసక్తికరమైన స్టోరీలతో ఎంటర్టైన్ చేస్తుంది. ఇది 2018 TCA అవార్డ్, 2019 పీపుల్స్ చాయిస్ అవార్డ్ ను కూడా గెలుచుకుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో

‘ది గుడ్ డాక్టర్’ (The good doctor) ఒక అమెరికన్ మెడికల్ డ్రామా సిరీస్. దీన్ని డేవిడ్ షోర్ సృష్టించాడు. ఇందులో ఫ్రెడ్డీ హైమోర్ (షాన్ మర్ఫీ), క్రిస్టీనా చాంగ్ (ఆడ్రే లిమ్), హిల్ హార్పర్ (ఆండ్రూస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2017 సెప్టెంబర్ 25న మొదలై, 2024 మే 21న ముగిసింది. ఇది ప్రసుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

షాన్ మర్ఫీ ఆటిజం ఉన్న ఒక యంగ్ డాక్టర్. అయితే అతనికి అద్భుతమైన మెమరీ, మెడికల్ స్కిల్స్ ఉన్నాయి. అతనికి ఉన్న ఆటిజం వల్ల ఇతరులతో మాట్లాడటం, ఎమోషన్స్ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అతను ప్రస్తుతం తాను ఉండే చిన్న ఊరు వదిలి, సాంఫ్రాన్సిస్కోలోని సెయింట్ బోనవెంచర్ హాస్పిటల్‌లో సర్జన్ గా చేరతాడు. హాస్పిటల్ గ్లాస్‌మన్ అనే ప్రెసిడెంట్ డాక్టర్ అతన్ని సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే షాన్ చిన్నప్పుడు గ్లాస్‌మన్ అతనికి తండ్రిలా ఉండేవాడు. కానీ అక్కడ ఉండే ఇతర డాక్టర్లు, షాన్ ఆటిజం వల్ల అతన్ని డౌట్ చేస్తారు. సీజన్ 1లో షాన్ తన స్కిల్స్‌తో పేషెంట్స్‌ను కాపాడుతాడు, కానీ అతను సోషల్ సమస్యలతో స్ట్రగుల్ అవుతుంటాడు. ఈ సమయంలో అతను లియా అనే అమ్మాయితో స్నేహం చేస్తాడు. అది క్రమంగా ప్రేమగా మారుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త మెడికల్ కేసుతో, షాన్ ఎమోషనల్ గ్రోత్ ని చూపిస్తుంది.


సీజన్ 2, 3లో షాన్ హాస్పిటల్‌లో తన స్థానం పదిలం చేసుకుంటాడు. అతను డాక్టర్ లిమ్, డాక్టర్ ఆండ్రూస్, డాక్టర్ రెజ్నిక్ లతో టీమ్‌గా పని చేస్తాడు. షాన్ తన అసాధారణ మెడికల్ ఐడియాలతో పేషెంట్స్‌ను కాపాడుతుంటాడు. లియాతో అతని ప్రేమ కథ కొనసాగుతుంది. కానీ ఆమె అతని ఆటిజం సమస్యలతో అడ్జస్ట్ అవ్వడానికి కష్టపడుతుంది. షాన్ గతంలో తన సోదరుడి మరణం, తండ్రితో సమస్యలు అతన్ని ఎమోషనల్‌గా బాధిస్తాయి. సీజన్ 4-7లో షాన్ మరింత గ్రో అవుతాడు. అతను హాస్పిటల్‌లో లీడ్ సర్జన్‌గా మారతాడు. కానీ లియాతో అతని సంబంధం ఒడిదొడుకులతో సాగుతుంది. చివరికి లియాని పెళ్లి చేసుకుని, ఇటు భర్తగా, అటు డాక్టర్ గా షాన్ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ సిరీస్ కి ఇలా శుభం కార్డ్ పడుతుంది.

Read Also : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

Related News

OTT Movie : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?

OTT Movie : కన్న తల్లిని కడుపులో నుంచే తినేసే పిల్ల రాక్షసి… డాక్టర్ కు కూడా చుక్కలు చూపించే సైతాన్

OTT Movie : జుట్టు పట్టుకుని కొట్టుకునే తల్లీకూతుర్లు… అపర కుబేరులే కానీ అంతులేని వింతలున్న ఫ్యామిలీ

OTT Movie : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

Big Stories

×