BigTV English

BJP: కేసీఆర్‌కి బిగ్ షాక్.. బీజేపీలోకి భోగ శ్రావణి.. ఆపరేషన్ లోటస్..

BJP: కేసీఆర్‌కి బిగ్ షాక్.. బీజేపీలోకి భోగ శ్రావణి.. ఆపరేషన్ లోటస్..

BJP: బీఆర్ఎస్‌కు ఇప్పుడు పరీక్ష కాలం. ఇప్పటికే కారు ఓవర్ లోడ్ అయింది. జిల్లాల్లో గ్రూపులు ఎక్కువయ్యాయి. నేతల మధ్య వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి. గులాబీ టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఇలాంటి సమయంలో.. ఏమాత్రం తేడా వచ్చినా.. నేతలు హర్ట్ అవుతున్నారు. కారు కాకపోతే కమలం.. అంటూ కాషాయ కండువా కప్పేసుకుంటున్నారు. బీజేపీకీ కావాల్సిందీ ఇదే. కాషాయ పార్టీకి ప్రజాదారణ ఉంటున్నా.. వారిని లీడ్ చేసే నాయకులే తక్కువ. ఆ వీక్‌నెస్ పసిగట్టే.. దమ్ముంటే 119 స్థానాల్లో స్థానాల్లో పోటీ చేయాలంటూ అధికార పార్టీ పదే పదే సవాల్ చేస్తోంది. బీజేపీ మాత్రం తాము అన్నిచోట్లా పోటీ చేసి తీరుతామని చెబుతోంది. లేటెస్ట్‌గా, రాష్ట్ర పార్టీ పెద్దలను ఢిల్లీకి పిలిపించి మరీ.. దిశానిర్దేశ్యం చేశారు అమిత్‌షా అండ్ నడ్డా. ఢిల్లీ బిగ్ లీడర్ల డైరెక్షన్‌లో తెలంగాణలో మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు కమలదళం కదనోత్సాహంతో ఉంది.


ఢిల్లీ మీటింగ్ ముగిసిన మర్నాడే.. ఓ బిగ్ లీడర్ కాషాయ కండువా కప్పేసుకున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన భోగ శ్రావణి.. బీజేపీలో చేరారు. ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో.. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో శ్రావణి, ఆమె భర్త భోగ ప్రవీణ్ కాషాయ కండువా కప్పేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల బీజేపీ టికెట్ భోగ శ్రావణికే అనే ప్రచారం జరుగుతోంది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో తీవ్ర విభేదాలు రావడంతో బీఆర్ఎస్‌ను వీడారు భోగ శ్రావణి. వెలమ దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ.. అప్పట్లో సంచలన ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. జగిత్యాల నియోజక వర్గానికి ఎమ్మెల్సీ కవిత ఇంఛార్జిగా ఉన్నారు. జగిత్యాలలో బీజేపీ ఎంత బలపడితే.. పరోక్షంగా ఎంపీ అర్వింద్‌కి అంత అదనపు బలం. తాజా చేరికతో అధిష్టానం దగ్గర ధర్మపురి అర్వింద్ పరపతి మరింత పెరిగినట్టైంది. వారి మధ్య ముందునుంచే డీల్ కుదిరిందని.. బీజేపీ టికెట్ కన్ఫామ్ అయ్యాకే.. భోగ శ్రావణి బీఆర్ఎస్‌ను వీడారని అంటారు.


ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో పక్కా టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీజేపీ. అధికార పార్టీ అసంతృప్తులను చాటుగా చేరదీస్తోంది. బలమైన నేతలకు, టికెట్ ఇస్తే గెలిచే సత్తా ఉన్న నాయకులను ఎంచుకుని.. ఆపరేషన్ లోటస్ నడిపిస్తోంది. మిషన్ 90 టార్గెట్‌గా చాపకింద నీరుగా రాజకీయం చక్కబెట్టేస్తోంది. ఇప్పుడు జగిత్యాల నుంచి భోగ శ్రావణి. ముందుముందు ఎన్నికల నాటికి ఇలాంటి శ్రావణిలు చాలామందే కాషాయ దళంలో చేరుతారని చెబుతున్నారు. ఈ పరిణామం గులాబీ బాస్ కేసీఆర్‌కు షాకింగ్ విషయమే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×