Mahbubabad Murder Case: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త తన భార్యను కత్తితో నరికి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నరేష్ గత కొంతకాలంగా మద్యానికి బానిసైపోయాడు. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి చేరి కుటుంబ సభ్యులపై దాడులు, గొడవలు సృష్టించడం అతనికి అలవాటైపోయింది. భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఎన్నిసార్లు అడ్డుకున్నా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇంట్లో మాటా మాటా పెడుతూ మానసిక వేదన కలిగించేవాడు.
గత మూడు రోజులుగా నరేష్ ప్రవర్తన మరింత దారుణంగా మారింది. ప్రతిరోజూ మద్యం సేవించి తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఉద్రిక్తత మరింత పెరిగింది.
భార్యపై దాడి
తాజాగా కూడా నరేష్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి.. కుమారుడితో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో తల్లిగా స్వప్న జోక్యం చేసుకుంది. తన కుమారుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి భర్తకు ఎదురుతిరిగింది. అయితే నువ్వు కూడా కొడుకుకు సపోర్ట్ చేస్తున్నావా? అనే ఆగ్రహంతో నరేష్ అదుపు కోల్పోయాడు. తన చేతిలో ఉన్న గొడ్డలితో భార్యపై దారుణంగా దాడి చేశాడు. క్షణాల్లోనే స్వప్న నేలకూలి ప్రాణాలు కోల్పోయింది.
గ్రామంలో కలకలం
ఈ ఘటన జరిగిన వెంటనే గ్రామస్థులు.. సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీం కూడా సంఘటనాస్థలంలో ఆధారాలు సేకరించింది. ప్రాథమిక దర్యాప్తులో మద్యపు అలవాటే ఈ దారుణానికి కారణమని పోలీసులు గుర్తించారు.
పోలీసులు తీసుకుంటున్న చర్యలు
నిందితుడు నరేష్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని కోర్టుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ ప్రకటించారు.