Sreeleela: ఇటీవల కాలంలో సినిమాలు ఒక భాషకే పరిమితకు కాకుండా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ఇతర భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాలలో నటించగా సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ సినిమాలలో అవకాశాలను అందుకుంటున్నారు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో అవకాశాలను అందుకుంటు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీ లీల(Sreeleela) కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.. అయితే తాజాగా శ్రీ లీల మరో బాలీవుడ్ ఛాన్స్ అందుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్విత్ చంద్రన్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న దోస్తానా 2 (Dostana 2)సినిమాలో ముందుగా కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వి కపూర్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి కార్తీక్ ఆర్యన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి విక్రాంత్ మాస్సే ఎంపిక అయ్యారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తప్పుకున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. మరి ఈమె స్థానంలో కొత్త హీరోయిన్ ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అయ్యాయి అయితే తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి నటి శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జాన్వి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
#Sreeleela replaces #JanhviKapoor in #Dostana2 🔔#VikrantMassey & #Lakshya to play the main male leads.✅ pic.twitter.com/XDrOaO7l0H
— Always Bollywood (@AlwaysBollywood) October 3, 2025
అసలు జాన్వీ కపూర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా జాన్వీ కపూర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం, శ్రీ లీలకు అవకాశం రావడంతో శ్రీ లీల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం అవుతుంది. ఇప్పటికే శ్రీ లీల ఈ సినిమా షూటింగ్ లో భాగమయ్యారని సమాచారం. ఇక శ్రీ లీల బాలీవుడ్ ఇండస్ట్రీలో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆషికి 3 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రణవీర్ సింగ్ కొత్త సినిమాలో కూడా చాన్స్ అందుకున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు. ఇక తాజాగా దోస్తానా 2 లో కూడా ఛాన్స్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోతున్నారు. ఇక తెలుగులో త్వరలోనే రవితేజతో కలిసి నటించిన మాస్ జాతర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
Also Read: Ramgopal Varma: రిషబ్ శెట్టిను చూసి సిగ్గు తెచ్చుకోండి.. వర్మ సంచలన పోస్ట్!