OTT Movie : ఫ్రెండ్‌షిప్, అబార్షన్ థీమ్‌తో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ భవిష్యత్తులో ఎన్నో డ్రీమ్స్ తో ఉన్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలసి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తరువాత అబార్షన్ కోసం జరిగే ఒక రోడ్ ట్రిప్ కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ సినిమా యూత్ కొని తెచ్చుకునే సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ?అనే వివరాల్లోకి వెళ్తే ..
‘అన్ ప్రెగ్నెంట్’ (Unpregnant) 2020లో వచ్చిన అమెరికన్ రోడ్ ట్రిప్ సినిమా. దీనిని రాచెల్ లీ గోల్డెన్‌బర్గ్ డైరెక్ట్ చేసింది. ఇందులో హేలీ రిచర్డ్సన్ (వెరానికా), బార్బీ ఫెర్రెయిరా (బెయిలీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 సెప్టెంబర్ 10న HBO Maxలో రిలీజ్ అయింది. 1 గంట 29 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
వెరోనికా 17 ఏళ్ల స్కూల్ అమ్మాయి, మిస్సౌరీలో ఉంటుంది. ఆమె చాలా స్మార్ట్, డాక్టర్ కావాలని అనుకుంటుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ జెరెమైతో డేటింగ్ చేస్తుంది. ఆ తరువాత ప్రెగ్నెంట్ అవ్వడంతో షాక్ అవుతుంది. ప్రెగ్నెన్సీ విషయం జెరెమైకి చెప్పకుండా తన బెస్ట్ ఫ్రెండ్ బెయిలీతో షేర్ చేసుకుంటుంది. బెయిలీ, వెరోనికాకు అబార్షన్ చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ దీని కోసం మిస్సౌరీలో తల్లిదండ్రుల అనుమతి కావాల్సి వస్తుంది. ఆమెకు ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పడం ఇష్టం ఉండదు. కాలేజ్ డ్రీమ్స్ పాడవుతాయని భయం. బెయిలీ, వెరోనికాను అబార్షన్ కోసం అట్లాంటాకి కార్‌లో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది.
వెరోనికా, బెయిలీ కార్‌లో అట్లాంటాకి బయలుదేరతారు. ఈ రోడ్ ట్రిప్ చాలా ఫన్నీ గా ఉంటుంది. వాళ్ళు ఒక హోటల్ లో స్టే చేస్తారు. అక్కడ ఒకరి గురించి ఒకరు, తమ సీక్రెట్స్ పైకి చెప్పుకుంటారు. వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఫ్రెండ్‌షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు వెరోనికా ప్రెగ్నన్సీ సింప్టమ్స్ ఫీల్ అవుతుంది. వెరోనికా, బెయిలీ అట్లాంటాకి చేరుకుని అబార్షన్ క్లినిక్‌కి వెళతారు. వెరోనికా చివరి నిమిషంలో బేబీని ఉంచుకోవాలా, తీయించుకోవాలా అనే డౌట్ లో ఉంటుంది. ఈ సమయంలో వెరోనికా బాయ్ ఫ్రెండ్ జెరెమైకి విషయం తెలిసిపోతుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. వెరోనికా అబార్షన్ చేయించుకుంటుందా ? అబార్షన్ విషయంలో జెరెమై స్టాండ్ ఏమిటి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా