BigTV English

MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

MSVPG: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara prasad Garu) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మీసాల పిల్ల అనే సాంగ్ ప్రోమో విడుదల చేయగా ఎంతో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో నయనతార (Nayanatara)శశిరేఖగా కనిపించబోతున్నట్లు ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


చిరు కోసం రంగంలోకి నాని విలన్..

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాని విలన్ షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) కనిపించబోతున్నట్లు సమాచారం. నాని హీరోగా నటించిన దసరా సినిమాలో ఆయనతో తలపడుతూ తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన షైన్ టామ్ చాకో తదుపరి తెలుగులో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న షైన్ టామ్ చిరంజీవితో పోటీ పడటానికి సిద్ధం కాబోతున్నారని తెలుస్తుంది.

విలన్ పాత్రలో షైన్ టామ్ చాకో..

ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ పాత్రను అనిల్ రావిపూడి చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో షైన్ టామ్ అయితే సరిగ్గా సూట్ అవుతారని అనిల్ రావిపూడి భావించారట. ఇప్పటికే ఈయనతో చిత్ర బృందం చర్చలు జరపగా షైన్ టామ్ చిరంజీవి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.


ఆస్కార్ రేసులో అనిల్ రావిపూడి చిత్రం..

ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొనేదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అంటే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇక ఈయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేసులో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

Related News

NBK 111: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలయ్య..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

Ramgopal Varma: రిషబ్ శెట్టిను చూసి సిగ్గు తెచ్చుకోండి.. వర్మ సంచలన పోస్ట్!

Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Rashmika -Vijay Devarakonda: కలిసి దసరా జరుపుకున్న విజయ్ రష్మిక.. రిలేషన్ పై క్లారిటీ ఇవ్వచ్చుగా?

Ramcharan -Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్..మెగా వారసుడు రాబోతున్నాడా?

Big Stories

×