BigTV English

Breaking Bad Habits : చెడు అలవాట్లకు లోనైతే దేవుడు కూడా కాపాడడా..?

Breaking Bad Habits : చెడు అలవాట్లకు లోనైతే దేవుడు కూడా కాపాడడా..?
Breaking Bad Habits

Breaking Bad Habits : ధర్మమే చివరికి గెలుస్తుందని మన వేద పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ధీరులైన వారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకంజ వేయరు. జీవితంలో సుఖం కన్నా దుఃఖమే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. మనిషి సుఖంగా ఎలా జీవించాలో ధార్మిక సాహిత్యం చెబుతుంది. వ్యసనాలకు లోనైతే భగవంతుడు అండగా ఉన్నా కష్టాలు పడవలసిందేనని తెలుపుతుంది పాండవుల కథ. ధర్మరాజు అంతటివాడు కూడా జూదంవల్ల సర్వం కోల్పోయి, అడవులకు వెళ్ళవలసి వచ్చింది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడు అండగా ఉన్న పాండవులు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతారు. కష్టాలు అనుభవిస్తారు.


పాండవులు అడవుల పాలైనా, వారు ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. వారు ధర్మపరులు కనుక, చివరకు దైవ సహాయంతో అధర్మంపై గెలిచి, సుఖసంతోషాలను పొందారు. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్నదే ముఖ్యం. వ్యసనాలతో సంపదలూ, సర్వం కోల్పోతున్నా వివేకజ్ఞానం లేక కష్టాలు పడతారు జనాలు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.

కష్టాలు కోతులలాంటివి. వాటికి భయపడితే మనం సర్వనాశనమవుతాం. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవలసిందని స్వామి వివేకానంద చెప్తారు. ఈ గుణపాఠాన్ని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఆత్మ విశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని, పాండవుల లాగా విజయం సాధించాలి. వేద, పురాణ ఇతిహాసాల సారాంశాన్ని మన జీవితానికి అన్వయించుకొని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లేకపోతే నష్టపోయేది మనమే! సత్యమేవ జయతే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. అసత్యం, అబద్ధం, అధర్మం, గెలవవు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×