BigTV English

 ipl 2023 : కోల్‌కత వర్సెస్ హైదరాబాద్… ఆ మూడు మ్యాచ్‌లు నిజంగా ఐకానిక్

 ipl 2023 : కోల్‌కత వర్సెస్ హైదరాబాద్… ఆ మూడు మ్యాచ్‌లు నిజంగా ఐకానిక్
ipl 2023

ipl 2023 :ఎక్కువ టైటిల్స్ గెలవలేకపోయినా.. కోల్‌కతా కూడా స్ట్రాంగ్ టీమే. ఇక బౌలింగ్ నే నమ్ముకుంటూ వస్తున్న హైదరాబాద్ జట్టు.. అప్పుడప్పుడు సెన్సేషన్స్ సృష్టిస్తూ ఆశ్యర్య పరిచే విజయాలు అందుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో మూడు ఇంట్రస్టింగ్ మ్యాచ్‌ల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి.


అది 2013 సీజన్. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో మ్యాచ్. ప్లే ఆఫ్స్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అది. ఒకవేళ ఓడితే రాయల్ ఛాలెంజర్స్ టీమ్ క్వాలిఫై అవుతుంది. ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగిన ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ను 130 పరుగులకే కట్టడి చేసింది హైదరాబాద్. ఛేజింగ్ కు దిగిన హైదరాబాద్… గట్టి ఫౌండేషనే వేసింది ఆ మ్యాచ్ లో. పార్థీవ్ పటేల్, శిఖర్ ధావన్ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ., ఇక్బాల్ అబ్దుల్లా దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది హైదరాబాద్. డారెన్ సమీ ఆచితూచి ఆడడంతో.. కష్టంగానైనా 130 పరుగులను చేజ్ చేసింది.

2019 సీజన్. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బ్యాట్ తో అదరగొట్టింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. మంచి స్కోర్ రావడంతో ఇక మ్యాచ్ గెలిచినట్టే అనుకుంది హైదరాబాద్. ఛేజింగ్ కు దిగిన కోల్ కతా కూడా ఒకే వికెట్ కోల్పోయి 87 పరుగులు చేసి.. మ్యాచ్ ను తనవైపు తిప్పుకుంది. బౌలింగ్ లో మ్యాజిక్ చేసే హైదరాబాద్ జట్టు.. వెంటవెంటనే మూడు వికెట్లు తీసి డిఫెన్స్ లో పడేసింది. ఫైనల్ ఓవర్ లో 13 పరుగులు కావాల్సిన ఆ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, షకీబ్ అల్ హసన్ రెచ్చిపోయి ఆడారు. కోల్ కతాను గెలిపించారు.


2014 సీజన్. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్. 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు… బౌలింగ్ బలాన్ని నమ్ముకుని కోల్ కతాను కట్టడి చేద్దామనుకుంది. అనుకున్నట్టుగానే మంచి ఫామ్ లో ఉన్న రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ ను త్వరగానే పెవిలియన్ పంపించింది హైదరాబాద్. ఆ తరువాత గ్రౌండ్ లోకి వచ్చిన యూసుఫ్ పఠాన్ పెద్ద విధ్వంసమే సృష్టించాడు. కేవలం 15 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. మొత్తం 22 బంతుల్లో 72 పరుగులు చేసి కోల్ కతాను గెలిపించాడు. హైదరాబాద్, కోల్ కతా మధ్య జరిగిన ఈ మూడు మ్యాచ్ లు నిజంగా ఐకానిక్. 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×