E-Paper
Advertisement

Chaitra Navratri 2024 : చైత్ర నవరాత్రి.. ఏ రోజు ఏ పూజ చేయాలంటే?

Chaitra Navratri 2024 : చైత్ర నవరాత్రి..  ఏ రోజు ఏ పూజ చేయాలంటే?
Advertisement

Chaitra Navratri 2024

Chaitra Navratri 2024: హిందూ మతంలో నవరాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని తెలుసుకుందాం?

Advertisement

సనాతన ధర్మంలో నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు భగవతీ దేవి ఆరాధనకు చాలా ముఖ్యమైనవి. ఒక సంవత్సరంలో రెండు నవరాత్రి ఉపవాసాలు ఆచరిస్తారు. మొదటి నవరాత్రి ఉపవాసాన్ని చైత్ర నవరాత్రిగా పాటిస్తారు. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు చైత్ర శుక్ల పక్షం ప్రతిపద తిథి నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ నవమి తిథితో ముగుస్తుంది.

మత విశ్వాసాల ప్రకారం చైత్ర నవరాత్రులలో భగవతీ దేవిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. ఆశీర్వాదాలు లభిస్తాయి. చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం?

Advertisement

Read More:  మీనరాశిలో బుధుడు ఉదయం.. ఈ రాశుల వారికి లాభాలు..

చైత్ర నవరాత్రి 2024 ప్రారంభ తేదీ..
వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం శుక్ల పక్షం ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11:50 గంటలకు ప్రారంభమవుతుంది. ిది ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 08:30 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఏప్రిల్ 9 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి.

చైత్ర నవరాత్రి 2024 ఘటస్థాపన సమయం..
చైత్ర నవరాత్రుల రోజున ఘటస్థాపనకు అనుకూలమైన సమయం ఉదయం 6:02 నుండి 10:16 వరకు ఉంటుందని పంచాంగంలో చెప్పారు. అంతే కాకుండా ఈ రోజు అభిజీత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన ఉంది. అభిజీత్ ముహూర్తం రాత్రి 11:55 నుంచి 12:45 వరకు ఉంటుంది. దీంతో నవరాత్రుల్లో మొదటి రోజు ఉదయం 07:32 వరకు కొనసాగి రేవతీ నక్షత్రం ఏర్పడి తర్వాత అశ్వినీ నక్షత్రం ప్రారంభం కానుంది. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగా. అమృత సిద్ధి యోగా కూడా ఏర్పడుతున్నాయి. ఇది ఉదయం 7:32 నుంచి ప్రారంభమవుతుంది.

చైత్ర నవరాత్రి పూజలు.. తేదీల జాబితా..
ఏప్రిల్ 9, మంగళవారం- మా శైలపుత్రి పూజ, ఘటస్థాపన
ఏప్రిల్ 10, బుధవారం- మా బ్రహ్మచారిణి పూజ
ఏప్రిల్ 11, గురువారం- మా చంద్రఘంట పూజ
ఏప్రిల్ 12, శుక్రవారం- మా కూష్మాండ పూజ
ఏప్రిల్ 13, శనివారం- మా స్కందమాత పూజ
ఏప్రిల్ 14, ఆదివారం- మా కాత్యాయని పూజ
ఏప్రిల్ 15, సోమవారం- మా కాలరాత్రి పూజ
ఏప్రిల్ 16, మంగళవారం- మా మహాగౌరీ పూజ, దుర్గా మహా అష్టమి పూజ
ఏప్రిల్ 17, బుధవారం- మా సిద్ధిదాత్రి పూజ, మహానవమి, రామనవమి
ఏప్రిల్ 18, గురువారం- దుర్గా విగ్రహం నిమజ్జనం

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×