Jio Mart iPhone offer: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు మార్కెట్లో హంగామా చేస్తూ కొనసాగుతున్నాయి. కానీ వాటికే సవాల్ విసురుతూ జియో మార్ట్ కూడా తన జియో ఉత్సవ్ సేల్ ను ప్రారంభించింది. ముఖ్యంగా ఐఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్ ఇప్పుడు చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి.
సాధారణంగా ఐఫోన్ అంటే చాలా ఖరీదైన ఫోన్ అని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి జియో మార్ట్ ఆ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తోంది. ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కంటే తక్కువ ధరలో, నమ్మకమైన డెలివరీతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది.
ఐఫోన్ 16ఈ విషయానికి వస్తే, ఇది కాంపాక్ట్ డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా ఫీచర్స్‌తో వస్తోంది. రోజువారీ వాడుకలో స్మూత్ పనితీరును ఇస్తుంది. అలాగే ఐఓఎస్ 18 అప్‌డేట్స్‌తో సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో ఆపిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
Also Read: Hyderabad Rains Today: వర్షం కారణంగా ఉప్పొంగిన ముసీ నది.. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మూసివేత
ఇక ఐఫోన్ 16 ప్లస్ మరో లెవెల్ అనుకోవచ్చు. పెద్ద స్క్రీన్ సైజ్‌తో, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో, గేమింగ్‌కి, సినిమాలు చూడటానికి పర్ఫెక్ట్ ఆప్షన్. డ్యూయల్ కెమెరా సెట్‌అప్, నైట్ ఫోటోగ్రఫీ సామర్థ్యం, ఇంకా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇవన్నీ ఈ మోడల్‌కి హైలైట్. ఎక్కువ ఫీచర్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ పిక్ అవుతుంది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఇంతకాలం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ మాత్రమే మొబైల్ ఆఫర్లలో ముందుండేవి. కానీ ఇప్పుడు జియోమార్ట్ కూడా పోటీగా వచ్చి, తక్కువ ధరకే ఐఫోన్ అందిస్తోంది. పండుగ సీజన్‌కి ఇది నిజంగా వినియోగదారులకు లాభదాయకమైన ఆఫర్.
ఒకవేళ కొత్త ఐఫోన్ కొనాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నా, బడ్జెట్ కారణంగా ఆగిపోతున్నారా? అయితే ఇదే సరైన సమయం. రూ.44,870 ప్రారంభ ధరలో కొత్త మోడల్స్ పొందే అవకాశం మిస్ కాకుండా చూసుకోవాలి. స్టాక్ పరిమితంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఆలస్యం లేకుండా జియోమార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచిది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్లతో పోలిస్తే జియోమార్ట్ ఈసారి ఇచ్చిన ప్రైస్ నిజంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరైనా ఐఫోన్ 16ఈ ఎంచుకోవచ్చు, లేక 16 ప్లస్ ఎంచుకోవచ్చు అది పూర్తిగా యూజర్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.