E-Paper
Advertisement

105 Discount on TSRTC Bus: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపికబురు.. 10% డిస్కౌంట్!

105 Discount on TSRTC Bus: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపికబురు.. 10% డిస్కౌంట్!

tsrtc latest news today

TSRTC is a Sweet Treat for Passengers, with a 10% Discount: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తింపజేస్తామని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ సోషల్‌ మీడియా X వేదిక ద్వారా వెల్లడించారు.ఈ డిస్కౌంట్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్నట్లు సజ్జనార్‌ తెలిపారు.

తెలంగాణలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన పథకాలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే.. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.

Read More: 14 ఎంపీ సీట్లు గెలవాలి.. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..

తాజాగా.. లహరి ఏసీ స్లీపర్ బస్సులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం నుండి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు వంటి ముఖ్య పట్టణాల రూట్లలో నడుపనున్నారు. లహరి ఏసీ స్లీపర్ కమ్‌ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ వరకు, ఇక గోదావరిఖని నుండి బెంగళూరు, కరీంనగర్ నుండి బెంగళూరు, నిజామాబాద్‌ నుండి బెంగళూరు, నిజామాబాద్ నుండి తిరుపతి వరకు, వరంగల్‌ నుండి బెంగళూరు వరకు ఈ రూట్లలో లహరి సర్వీసులను నడపనున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×