Movies in October: మిగతా నెలలతో పోల్చుకుంటే సెప్టెంబర్ నెల తెలుగు బాక్స్ ఆఫీస్ కి మంచి ఊరట కలిగించింది. ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్ అనే సినిమాలతో ప్రారంభమైన ఈ సెప్టెంబర్ నెల బాక్సాఫీస్ కి మంచి ఆదాయాన్ని కూడా అందించింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్, తాజాగా వచ్చిన ఓజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబడుతున్నాయి. ఈనెల పూర్తవడానికి 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలోనే అక్టోబర్ నెల కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి దసరా, దీపావళి ఒకేసారి రాబోతున్నట్లు చాలా పెద్ద పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరి అక్టోబర్ నెలలో విడుదల కాబోయే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 1: ఇడ్లీ కొట్టు
తమిళ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఇడ్లీ కడై. తెలుగులో ఇడ్లీ కొట్టు అంటూ రిలీజ్ చేయబోతున్నారు. నిత్యామీనన్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అక్టోబర్ 2 : కాంతార చాప్టర్: వన్
చిన్న సినిమాగా కన్నడ ఇండస్ట్రీలో వచ్చి సత్తా చాటిన చిత్రం కాంతార. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ విడుదల కాబోతోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ అక్టోబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఒకేరోజు 7వేలకు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది. అలాగే హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా దీనికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.
అక్టోబర్ 10 :
1. శశివదనే:
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ప్రేమ కథ చిత్రం ఇది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.
2. మారియో
3. సీతా ప్రయాణం కృష్ణతో
4. ఎర్ర చీర
5. కానిస్టేబుల్
6. ట్రాన్స్ ఎరిస్
ఈ చిత్రాలన్నీ అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతున్నాయి.
అక్టోబర్ 16:
మిత్రమండలి: దీపావళి ధమాకా అక్టోబర్ 16 నుంచి మొదలు కాబోతోంది. పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి పయనమవుతున్నాయి. ఆ చిత్రాలలో మిత్రమండలి కూడా ఒకటి. అక్టోబర్ 16వ తేదీన రాబోతున్న ఈ చిత్రం నవ్వించడమే లక్ష్యంగా రూపొందుతోంది. ప్రియదర్శి, నిహారిక ఎన్. ఎం. రాజ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అక్టోబర్ 17:
తెలుసు కదా: సిద్దు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ప్రేమకథా చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నీరజాకోన దర్శకత్వం వహించారు.
2). ఫ్రెండ్లీ ఘోస్ట్
3). కాంత
4). డ్యూడ్
అక్టోబర్ 18 :
కె ర్యాంప్:
కిరణ్ అబ్బవరం కథానాయకుడుగా వస్తున్న ఈ చిత్రం జైన్స్ నాని దర్శకత్వంలో వస్తోంది. శివ బొమ్మ, రాజేష్ దండ కలిసి నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 31 :
బాహుబలి ది ఎపిక్:
వరుసగా వచ్చిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలతో కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రాబోతోంది.
మాస్ జాతర:
మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది.
ALSO READ:Dhanush: 8ఏళ్లు పేదరికంలోనే ఉన్నా.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్!