Dasun Shanaka Run Out: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రసవత్తర పోరు సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. అయితే సూపర్ ఓవర్ లో టీమిండియా అద్భుతంగా ప్రదర్శన కనబరచడంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బంతికే బౌండరీ కొట్టిన సూర్య కుమార్ యాదవ్… టీమిండియాను గెలిపించాడు. అయితే ఈ సూపర్ ఓవర్ లో శ్రీలంక ఆటగాడు దాసున్ షనకా ( Dasun Shanaka ) రన్ అవుట్ అయినప్పటికీ కూడా నాట్ అవుట్ అంటూ ప్రకటించారు అంపైర్లు. దీంతో టీం ఇండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీసీ రూల్స్ ప్రకారం… దాసున్ షనకా నాటౌట్ అంటూ ప్రకటించారు. దీంతో మళ్లీ బ్యాటింగ్ చేశాడు దాసున్ షనకా. అయినా.. అర్ష్ దీప్ వేసిన చక్కటి బంతికి నెక్ట్స్ బాల్ కే అవుట్ అయ్యాడు దాసున్ షనకా ( Dasun Shanaka ). ఈ దెబ్బకు లంక… సూపర్ ఓవర్ లో 2 పరుగులు మాత్రమే చేసింది. ఆ రెండు పరుగులను ఒకే బంతికి కొట్టేసి ఇండియా గెలిచింది.
టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసింది శ్రీలంక. ఈ నేపథ్యంలోనే తొలి బంతికే పెరీరా అవుట్ అయ్యాడు. అర్శదీప్ సింగ్ బౌలింగ్ లో… క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పెరీరా. ఆ తర్వాత మెండిస్ బ్యాటింగ్ కు వచ్చాడు. సింగిల్ తీశాడు. ఈ నేపథ్యంలో దాసున్ షనకా స్ట్రైకింగ్ అందుకున్నాడు. అయితే అర్శ్‌దీప్ బౌలింగ్ లో రెండు డాట్స్ వచ్చాయి. దీంతో ప్రెషర్ లోకి వెళ్లిపోయాడు దాసున్ షనకా. తర్వాతి బంతిని షార్ట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి బ్యాట్ కు తగిలినట్లే తగిలి వికెట్ కీపర్ చేతిలో పడింది. దీంతో పరుగుకు ప్రయత్నం చేశారు.
కానీ చాకచక్యంతో వికెట్లను గిరాటేశాడు కీపర్ సంజు శాంసన్. అయితే లెగ్ అంపైర్ దాన్ని రన్ అవుట్ గా అడగకముందే ఇచ్చేశాడు. ఇటు బౌలర్ అర్షదీప్ అది వికెట్ కీపర్ క్యాచ్ అంటూ అప్పీల్ చేశాడు. అప్పుడు మెయిన్ ఎంపైర్ కూడా.. క్యాచ్ అవుట్ అంటూ ప్రకటించేశాడు. దీంతో తెలివి ఉపయోగించిన దాసున్ షనకా థర్డ్ ఎంపైర్ కు రివ్యూ కి వెళ్ళాడు. అక్కడ నాటౌట్ గా తేలిపోయింది. అదేంటి రన్ అవుట్ అయిన వ్యక్తిని నాటౌట్ గా ఇవ్వడమేంటని అందరూ షాక్ అయ్యారు. టీమిండియా ప్లేయర్లు కూడా ఈ విషయంపై ఏం పేరుతో వాగ్వాదానికి దిగి .. రచ్చ రచ్చ చేశారు.
టీమిండియా బౌలర్ అర్షదీప్ వేసిన బాల్.. కీపర్ చేతుల్లోకి వెళ్లగానే… సంజూతో పాటు అర్శదీప్ అప్పీల్ కు వెళ్లారు. ఈ తరుణంలోనే.. మెయిన్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో దాసున్ షనకా రివ్యూకు వెళ్లాడు. రివ్యూకు ఒక ఆటగాడు వెళితే… అప్పటి నుంచి బంతి డెడ్ బాల్ గా పరిగణించబడుతుంది. అందుకే ఐసీసీ రూల్స్ ప్రకారం… రనౌట్ చేసినప్పటికీ… పరుగులు తీసినా.. లెక్కలోకి రావన్న మాట. అదే సమయంలో రనౌట్ కూడా నాటౌట్ అయింది. ఇక కీపర్ క్యాచ్ విషయంలో.. బ్యాట్ కు బంతి తగలకపోవడంతో… షనకా బతికి బయటపడ్డాడు. రూల్స్ ప్రకారం మరోసారి బ్యాటింగ్ చేశాడు. కానీ.. నెక్ట్స్ బంతికే షనకా ఔట్ అయ్యాడు. దీంతో ఇండియా విజయం సాధించింది.
🚨Chaos in the Super Over! 🚨
Arshdeep to Shanaka — given caught behind, Sri Lanka reviews… but wait! Samson throws down the stumps with a direct-hit too! 🎯
No bat, review successful — but since it was given out initially, the ball’s dead. No run-out, no second chance.… pic.twitter.com/zh6ifYsjjs
— Asia Voice 🎤 (@Asianewss) September 26, 2025
SUPER OVER DRAMA! 📷By the time the umpire gave Dasun Shanaka OUT, he was already run out! 📷 🤔
what rules says :-
According to MCC Law 20.1.1.3, once a batter is dismissed, the ball becomes dead. So even if the review overturned Shanaka’s caught behind, the subsequent run-out… pic.twitter.com/Sr9izXeACb— Sporttify (@sporttify) September 26, 2025
ASIA CUP 2025 PEAKED HERE…!!! 🥶 pic.twitter.com/5FDcwlwr3v
— Johns. (@CricCrazyJohns) September 27, 2025