Road Accident: రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అతివేగంగా డీసీఎం వాహనంను ఢీకొనడంతో.. ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆటోలో ప్రయాణిస్తున్న వారు యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందినవారు. వారు కుటుంబ అవసరాల కోసం సమీప పట్టణానికి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది.
మృతుల వివరాలు
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు చూస్తే.. సత్తెమ్మ (50), శ్రీనివాస్ (35), శ్రీధర్ (25) మృతులు ముగ్గురూ యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఒక్కసారిగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో.. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గాయపడిన వారిపై చికిత్స
ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆసుపత్రులకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని.. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
పోలీసుల చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా, లేక వాహనం లోపాల వలన జరిగిందా అన్న దానిపై విచారణ జరుగుతోంది.