Musi Floods: మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్‌లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, డిఆర్ఎఫ్, పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.ప్లాట్ ఫామ్ మీద ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంజీబీఎస్‌లో పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకి తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) లోపలికి వరద నీరు వచ్చాయి. దీంతో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) అధికారులు తక్షణమే అప్రమత్తమై, MGBS నుంచి అన్ని బస్సు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను కాపాడేందుకే తీసుకున్నట్టు TGSRTC వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్‌కారు ప్రకటించారు.
హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. మూసీ నది ఒడ్డున ఉన్న MGBS పూర్తిగా జలమయమైంది. రాత్రి సమయంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి HYDRAA డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (DRF), పోలీసులు, TGSRTC సిబ్బంది కలిసి పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రెస్క్యూ ఆపరేషన్‌లను పరిశీలించి, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటన దసరా, బతుకమ్మ పండుగల సమయంలో జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
TGSRTC ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. MGBS నుంచి రావాల్సిన బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నారు. ప్రయాణికులు MGBSకు రాకుండా, ఈ ప్రత్యామ్నాయ పాయింట్‌లకు వెళ్లి బస్సులు ఎక్కాలని సూచించారు. ఇక్కడ మార్గాల వారీగా వివరాలు:
* ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మార్గాలు: JBS నుంచి బస్సులు నడుస్తాయి.
* వరంగల్, హన్మకొండ మార్గాలు: ఉప్పల్ ఎక్స్ రోడ్స్ నుంచి సేవలు.
* సూర్యాపేట్, నల్గొండ, విజయవాడ మార్గాలు: ఎల్‌బీ నగర్ నుంచి బస్సులు ప్రారంభం.
* మహబూబ్‌నగర్, కుర్నూల్, బెంగళూరు మార్గాలు: ఆరంగార్ నుంచి నడుస్తాయి.
ఈ మార్గాల్లో బస్సులు సాధారణ షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి, కానీ పండుగ రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. TGSRTC మొత్తం 7,754 స్పెషల్ బస్సులను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు నడుపుతోంది, ఇందులో MGBSతో పాటు JBS, ఉప్పల్, ఎల్‌బీ నగర్ వంటి ప్రధాన స్టేషన్‌ల నుంచి సేవలు ఉన్నాయి. అయితే, MGBS మూసివేతతో ఈ స్పెషల్ బస్సులు ప్రత్యామ్నాయ పాయింట్‌లకు మార్చారు. టికెట్ బుకింగ్‌కు TGSRTC అధికారిక వెబ్‌సైట్ (www.tgsrtc.telangana.gov.in) లేదా యాప్ ఉపయోగించాలని సూచించారు.
Also Read: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య
ప్రయాణికులు MGBSకు ఎవరూ రాకూడదని TGSRTC గట్టిగా హెచ్చరించింది. వర్షాలు కొనసాగుతున్నందున, IMD మరోరోజు భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. హైదరాబాద్‌లోని మూసానగర్, షేక్‌పేట వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో వందలాది మంది బాధపడుతున్నారు. పోలీసు, ట్రాఫిక్, GHMC, విద్యుత్ విభాగాలు అలర్ట్‌పై ఉన్నాయి. ప్రభుత్వం రెస్క్యూ సెంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఆహారం, వసతి కల్పిస్తుంది.
మరిన్ని వివరాలకు TGSRTC కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033కు సంప్రదించాలి. లేదా అధికారిక ట్విటర్ హ్యాండిల్ @TGSRTCHQలో అప్‌డేట్‌లు చూడవచ్చు.
MGBS నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన టీజీఎస్ఆర్టీసీ
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో MGBS ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో బస్సుల రాకపోకల నిలిపివేత
MGBSకు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి
MGBS నుంచి నడిచే బస్సులను ఇతర… https://t.co/BF0UiL0ys8 pic.twitter.com/aO17xo8zio
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2025