Producer Reacts on Kantara Chapter 1 set cursed: చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది కన్నడ మూవీ ‘కాంతార‘. కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్తో ప్రాంతీయ భాష చిత్రంగా కాంతర తెరకెక్కింది. కన్నడలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. దీంతో కాంతారను ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకుని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ కాంతారకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్ల వసూళ్లు చేసి పాన్ ఇండియా హిట్ కొట్టింది.
కాంతారకు ఆ శాపం..
దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు రిషబ్ శెట్టి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటోంది. అయితే ముందు నుంచి కాంతార: చాప్టర్ 1ను ముందు నుంచి అవరోధాలు వెంటాడుతున్నాయి. సినిమా సెట్లో తరచూ ఎదోక ప్రమాదం జరుగుతుంది. వరుస మరణాలు సినిమాను వెంటాడుతున్నాయి. దీంతో కాంతార మూవీకి ఏదో శాపం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా సెట్లో వరుస ప్రమాదాలు, ఆర్టిస్టుల వరుస మరణాలు ఈ రూమర్స్కి మరింత బలాన్ని ఇస్తున్నాయి. దీంతో కాంతార ప్రీక్వెల్ ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ రూమర్స్ తాజాగా నిర్మాత చలువ గౌడ స్పందించారు. దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియోలు రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. కాంతార సినిమా విషయంలో వస్తున్న వార్తలు, అపోహాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను.
నిర్మాత కామెంట్స్
మూవీ షూటింగ్లో దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు చేసుకున్నాయి. మూవీ సెట్లో ఒక్కసారి మాత్రమే అగ్నీ ప్రమాదం జరిగింది. మిగిలివన్ని సినిమాకు సంబంధం లేనివి” అని క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న వరుస సంఘటనలపై ఇలా వివరణ ఇచ్చారు. ‘2024లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో మూవీ టీం గాయాలతో బయటపడింది. అలాగే 2025 జనవరిలో సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం రిషబ్ శెట్టి సహా కొంతమంది టీం సభ్యులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. కానీ ఈ ఘటన నుంచి అంతా సేఫ్గా బయటపడ్డారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీటిపాలయ్యాయి‘ అని చెప్పుకొచ్చారు. అనంతరం.. “మనమంత దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాం. రోజూ పూజ చేసుకుంటాం. ఏ పని చేసినా దేవుడిని ఆశీస్సులు ఉండాలని మొక్కుతాం. అలాగే కాంతార: చాప్టర్ 1 తీసేసమయంలో కూడా మేము దేవుడి ఆశీస్సుల కోసం పంజుర్లిని (తమిళనాడులోని పురాతన దైవాలలో పంజుర్లీ ఒకటి) ఆలాయానికి వెళ్లాం.
Also Read: Pooja Hegde: ‘బాహుబలి 3′లో ప్రభాస్ సరసన నేనే హీరోయిన్.. పూజా షాకింగ్ కామెంట్స్
అవరోధాలు ఉన్నాయని చెప్పారు
అక్కడ పండితులను కలిసి సినిమా గురించి చెప్పి దేవుడి నిర్ణయాన్ని అడిగాం. దీనికి మాకు సానుకూల సమాధానం వచ్చింది. ‘షూటింగ్కి కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు‘ అని సమాధానం వచ్చింది. అదే ధైర్యంతో సినిమా షూటింగ్ని ప్రారంభించారం. 80 శాతం వరకు షూటింగ్ నిజమైన ప్రదేశాల్లోనే తీశాం. ఎక్కువగా దట్టమైన అడవి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఉదయం 4 గంటలకే లేచి 4:30 నిమిషాలకు రెడీ అయ్యి షూటింగ్ స్పాట్ కి వెళ్లే వాళ్లం. ఉదయం 6 గంటల వరకు చిత్రీకరణ మొదలయ్యేది. షూటింగ్ లోకేషన్స్ అన్ని కూడా నగరానికి వందల కిలోమిటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి తోడు వాతావరణ ఇబ్బంది పెడుతూనే ఉంది. టైం వేస్ట్ అవుతుందని వర్షంలోనే యాక్షన్ సీక్వెన్స్ తీశాం. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. కానీ, ఫైనల్ ఫుటేజ్ చూశాక.. మేము సమయం వృథా చేయాలేదు అనిపించింది‘ అంటూ పేర్కొన్నారు. కాగా హోంబలే ఫిల్మ్స్పై చలువ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2 వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.