E-Paper
Advertisement

Krishna Janmashtami 2024: జన్మాష్టమి శుభ ముహూర్తం, పూజా విధానం వివరాలు ఇవే..

Krishna Janmashtami 2024: జన్మాష్టమి శుభ ముహూర్తం, పూజా విధానం వివరాలు ఇవే..
Advertisement

Krishna Janmashtami 2024: శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు అని పురాణాలు చెబుతాయి. ఈ క్రమంలో హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో వచ్చే ఈ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన అంటే సోమవారం నాడు జన్మాష్టమిని జరుపుకోనున్నారు. జన్మాష్టమిని చాలా పేర్లతో పిలుస్తుంటారు. జన్మాష్టమి లేదా గోకులాష్టమి, శ్రీ కృష్ణ జయంతి అని కూడా అంటారు. జన్మాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం జన్మాష్టమి నాడు కొన్ని శుభ యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ క్రమంలో జన్మాష్టమి నాడు చేసే పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శుభ ముహర్తం

Advertisement

ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీన సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి ఆగస్టు 27 మంగళవారం అర్ధరాత్రి 2:19 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం కూడా ఆగస్టు 26వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3:55 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఆగస్టు 27న మంగళవారం మధ్యాహ్నం 3:38 గంటలకు ముగుస్తుంది.

కృష్ణాష్టమి నాడు ఉపవాసం పాటిస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శ్రీ కృష్ణుడిని ప్రార్థించి ఉపవాసం పాటిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని అంటారు. అంతేకాదు ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్రనామా పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు, సకల శుభకాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వేణుగోపాలుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయని అంటారు. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కంద పురాణంలో వివరించబడింది.

Advertisement

పూజా విధానం

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యను పూజించడానికి తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకుని కన్నయ్యను పూజించాలి. ఈ క్రమంలో శ్రీ కృష్ణుడికి జలాభిషేకం చేయాలి. అనంతరం కన్నయ్యను ఊయలలో కూర్చోబెట్టి ఊపాలి. కృష్ణుడికి ఇష్టమైన లడ్డూలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం రాత్రి వేళ కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి.

పూజా మంత్రం

1. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
2. ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×