E-Paper
Advertisement

Snake in Srisailam: శ్రీశైలంలో శివలింగానికి చుట్టుకున్న నాగుపాము.. శివయ్య లీలేనా..

Snake in Srisailam: శ్రీశైలంలో శివలింగానికి చుట్టుకున్న నాగుపాము.. శివయ్య లీలేనా..
Advertisement

Snake around Shiva Lingam in Srisailam: శ్రీశైలంలో అద్భుతం జరిగింది. పాతాళగంగ రోడ్డు మార్గం, వజ్రమ్మ గంగమ్మ సమీపంలో ఓ ఆలయం ఉంది. అక్కడ నిత్యం శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. మంగళవారం శివలింగానికి అభిషేకం చేయడానికి భక్తులు వచ్చారు. అయితే అక్కడ ఉన్న వాళ్లకు ఓ మహా అద్భుతం కనిపించింది. శివ లింగాన్ని చుట్టుకుని ఉన్న నాగుపాము భక్తులకు కనిపించింది. చాలా సేపు శివలింగం చుట్టూ నాగుపాము ఉండటంతో భక్తులు శివలింగాన్ని చూడటానికి తరలివచ్చారు.

చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ఇదంతా శివుడి మహిమ అని కొందరు అంటుంటే.. మరికొందరు హరహర మహదేవ అంటూ శివుడిని ఆరాధించారు. దీంతో శివనామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఆ నోటా ఈ నోటా ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాలకు కూడా పాకింది. సుమారు గంటకుపైగా ఆ నాగుపాము శివ లింగం చుట్టూ ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని స్థానికులు కూడా చెబుతున్నారు.

Advertisement

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×