BigTV English

AP Cabinet Meeting Concludes: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

AP Cabinet Meeting Concludes: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

Andhra Pradesh Cabinet Meeting Concludes: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు పూర్తయిన సందర్భంగా.. నెలరోజుల పనితీరుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇక కేబినెట్ భేటీ అనంతరం.. సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చాలాసేపు చర్చించారు. మంత్రులకు కేటాయించిన శాఖల మీద ప్రతి నెలా సమీక్షలు చేయాలని, ఎప్పటికప్పుడు తమ శాఖల పరిస్థితిని జనానికి తెలియజేయాలంటూ వారికి సూచించినట్లు సమాచారం. నూతన ఇసుక పాలసీలో జోక్యం చేసుకోవొద్దని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. బోట్ సోసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చంద్రబాబు.. మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే…


  • ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
  • కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read: Three new airports in AP: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?

  • కొత్త ఇసుక పాలసీపై త్వరలోనే విధివిధానాలు రూపొందించేందుకు నిర్ణయం తీసుకుంది.
  • పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ విషయమై కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి కూడా ఆమోదం తెలిపింది.
  • పంటలకు బీమా పథకానికి సంబంధించి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని నిర్ణయం.
  • ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని కేబినెట్ నియమించింది.
  • మంత్రులు అచ్చెం నాయుడు, అనగాని, నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
    రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది.

Tags

Related News

Nellore News: ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు.. ఏకంగా హాస్పిటల్ బెడ్ పైనే.. ఏంటీ దారుణం?

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

Big Stories

×