BigTV English

Coconuts : అక్కడ మహిళలు కొబ్బరి కాయ కొట్టకూడదా….

Coconuts : అక్కడ మహిళలు కొబ్బరి కాయ కొట్టకూడదా….
Coconuts

Coconuts : దేవాలయాల్లో, మతపరమైన వేడుకల్లో కొబ్బరికాయలు కొట్టడం ద్వారా దేవతలకు నైవేద్యం సమర్పించినట్లుగా భక్తులు భావిస్తుంటారు.భగవంతుని ఆశీర్వాదానికి ఇదే మార్గంగా లెక్కపెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను చంద్రుని చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయను పగలగొట్టడం అహంకారాన్ని తొలగించడంపై హిందూమతంలో భావిస్తారు. ఎలాంటి అహంకారం, తరతమ భేదం, ఇతర చెడు భావోద్వేగాలు లేకుండా తమను తాము దైవానికి సమర్పించడానికి సూచికగా కొబ్బరికాయ కొట్టడాన్ని పరిగణిస్తాం. కొబ్బరి కాయను కొట్టడానికి బలం అవసరం. స్త్రీలకో పోలిస్తే పురుషులు బలవంతులను ఆనాటి కాలంలో భావించారు. అలా కొబ్బరికాయలను పురుషులే మాత్రమే కొట్టేవారు.


మహిళలు కొబ్బరికాయలు పగలగొట్టకూడదని ప్రత్యేక నియమం అంటూ ఏదీ లేదు. చాలా దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయ కొట్టడాన్ని తప్పుగా భావించరు. మతపరమైన వేడుకల్లోనూ మహిళలు కొబ్బరికాయ కొట్టడాన్ని అనుమతిస్తున్నారు. స్త్రీలు కొబ్బరికాయలు కొట్టవద్దన్నది ఆచారాన్ని చాలా మంది సమర్థించడం లేదు. సమానత్వం అనే అంశం ప్రతి చోటా అమలు అవుతుండటం వల్ల కొబ్బరికాయ కొట్టడం అనే విషయంలో స్త్రీ, పురుష భేదం నేటి రోజుల్లో అసలే లేదు. ఉత్తరాదిలో కొన్ని చోట్ల అయితే కొంత మంది ఇప్పటికీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టవద్దని నమ్ముతున్నారు. పలు సంప్రదాయాల్లో కొబ్బరికాయ కొట్టడాన్ని ఇప్పటికీ తప్పుగా పరిగణిస్తున్నారు. అయితే ఇతరుల నమ్మకాలను, విశ్వాసాలను గౌరవించడం ముఖ్యం. మహిళలు తమకు తాముగా కొన్ని ఆచారాలు పాటిస్తుంటే వారిని గౌరవించాల్సిందే.

పురాణాల ప్రకారం లక్ష్మీసమేతుడై విష్ణమూర్తి భూలోకానికి వచ్చినప్పుడు కొబ్బరి చెట్లను నాటాడని చెబుతుంటారు. వాళ్లిద్దరికీ కూడా కొబ్బరి చెట్టు చాలా ప్రీతికరమైనది. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. కాబట్టే పూజా కార్యక్రమాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇళ్లల్లో కూడా కొబ్బరి చెట్టును పెంచుకోవడం మంచిదంటారు.


Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×