Shukra Gochar 2024: శుక్రుడిని ప్రేమ, అందం, సంపద, కీర్తి , ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. శుక్రుడు 2 డిసెంబర్ 2024, సోమవారం ఉదయం 11:46 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి సంచారము వల్ల 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 3 రాశుల వారు సమస్యలను ఎదుర్కుంటారు
ఇతర గ్రహాల మాదిరిగానే, ఆనందం, శ్రేయస్సు, సంపదను ఇచ్చే శుక్రుడు, రాశులను ప్రభావితం చేసే నిర్దిష్ట వ్యవధిలో తన రాశిచక్రాన్ని శుక్రుడు మారుస్తాడు. 2 డిసెంబర్ 2024, సోమవారం ఉదయం 11:46 గంటలకు మకరరాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు.మరి శుక్రుడి సంచారం వల్ల ఏ ఏ రాశుల వారు సమస్యలు ఎదుర్కుంటారనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
శుక్రుడి రాశి మార్పు వృషభ రాశి వారికి సమస్యలను తెచ్చి పెడుతుంది. కొంత మంది జీవితాల్లో శ్రేయస్సు రాబోతుంది. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను కూడా త్వరలో పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఉద్యోగంలో బదిలీతోపాటు పదోన్నతి లభించే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యక్తులు న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు మాత్రం పెరుగుతాయి. ఆర్ధికంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తారు. డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు కాస్త ఆలోచించి తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి.
మిథున రాశి:
శుక్రుడి రాశి మార్పు మిథున రాశి వారికి అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. అంతే కాకుండా వృత్తి విషయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కుంటారు.కుటుంబ సభ్యులతో కొత్త సమస్యలు పెరుగుతాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతే కాకుండా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీ భాగస్వామితో గొడవలకు దిగకండి. విద్యర్థులు కష్టపడి చదవాల్సిన సమయం ఇది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పనులు కూడా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి వారికి డిసెంబర్ 2 నుంచి ఆర్థిక పరంగా నష్టాలు పెరుగుతాయి. చేసే పనుల పట్ల అప్పమత్తంగా ఉండండి. పనులు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
Also Read: 12 రాశుల వారి జాతకం డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందంటే ?
కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రుని సంచారం కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. అంతే కాకుండా మీ దగ్గరి బందువుల నుంచే మీరు సమస్యలు ఎదుర్కుంటారు. ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కుటుంబంలో మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతే కాకుండా ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసుల్లో పెద్ద బాధ్యతను స్వీకరించి సమస్యలు ఎదర్కుంటారు. ఆరోగ్యం పట్ల తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆరోచించడం అవసరం. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి పరంగా ఈ సమయంలో సమస్యలు పెరుగుతాయి.