Expensive Smartphones : ఇప్పటివరకూ ఖరీదైన ఫోన్ ఏదంటే.. ఐఫోన్ అని టక్కున చెప్పేస్తారు. ఈ ఫోన్ దానితో పాటు ఫీచర్స్ సైతం అదే స్థాయితో ఉంటాయన్నమాట నిజమే. అయితే ప్రపంచంలో ఐఫోన్ ను మించిన తోపు మొబైల్స్ కొన్ని ఉన్నాయి. వీటి ధర తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే.
తాజాగా లాంఛ్ అయిన మొబైల్స్ లో హై క్వాలిటీ ఫీచర్స్ తో పాటు అదిరిపోయే విధంగా టాప్ మొబైల్స్ ఉన్నాయి. యాపిల్ తీసుకొచ్చిన ఐఫోన్స్ తో పాటు సామ్ సాంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ మొబైల్స్ సైతం లక్షల్లో ఉన్నాయన్నమాట నిజమే. అయితే ఇవి మాత్రమే కాదు ఇప్పటివరకు తెలియని కొన్ని మొబైల్స్ ధర ఐఫోన్ ను మించిపోయి ఉంది.
ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ 16 ప్రో ధర సుమారు రూ.1,50,000 వరకూ ఉంది. అయితే ఇప్పటివరకు ఈ మొబైలే ఖరీదైనది అనుకుంటే భ్రమ పడినట్టే. అంతకు మించిన ఫోన్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ కు ధీటుగా ఫీచర్లతో పాటు ధరలో సైతం రెట్టింపు ఉన్న టాప్ 5 మొబైల్స్ ఇవే.
Porsche Design Huawei Mate 30 RS – హువాయి మేట్ 30 ఆర్‌ఎస్ పోర్చే డిజైన్ మెుబైల్ ధర రూ. 2,14,990. అయితే ఈ ఫోన్ ప్రస్తుతానికి లాంఛ్ కాలేదు. ఇక ఇప్పటి వరకూ లీక్ అయిన ఫీచర్స్ మాత్రం కిర్రాక్ అనిపిస్తున్నాయి. ఇందులో 2.86 GHz ప్రాసెసర్, కిరిన్ 990 ఆక్టా కోర్ చిప్‌సెట్ ఉన్నాయి. 6.53 అంగుళాల డిస్ ప్లే Full HD క్వాలిటీతో రాబోతుంది.
Huawei Mate X2 – హువాయ్ మేట్ ఎక్స్2 మెుబైల్ లో 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. 8 అంగుళాల డిస్ ప్లే Full HDక్వాలిటీతో వచ్చేసింది. ఇక ఈ మెుబైల్ ధర రూ. 2,04,999.
Lamborghini 88 Tauri – అత్యంత ఖరీదైన మెుబైల్స్ జాబితాలో ఉన్న మరో మెుబైల్ ఇదే. 5 అంగుళాల డిస్ ప్లే Full HD తో వచ్చేసిన ఈ మెుబైల్ ధర రూ.3,60,000. ఇందులో క్వాడ్ కోర్ 2.3 GHz చిప్‌సెట్ సైతం ఉంది.
Samsung Galaxy Z Fold 6 Ultra – సామ్ సాంగ్ ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసిన ఈ మెుబైల్ ధర రూ. 1,99,990. ఇందులో 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్నాయి.
Xiaomi Redmi K20 Pro Signature Edition – ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను తీసుకొస్తున్న షావోమి.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మెుబైల్ ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్ లో బంగారం, డైమండ్స్ పొదిగారు. ఇక దీని ధర రూ. 4,80,000.ఇందులో 6.39 అంగుళాల స్కీన్ తో పాటు 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4000mah బ్యాటరీ ఉంది.
ఈ టాప్ మొబైల్స్ ఫీచర్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్నప్పటికీ ధర మాత్రం దిమ్మ తిరిగేలా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఖరీదైన మొబైల్స్ ను మీరూ సొంతం చేసుకోవాలనుకుంటే ఓసారి ట్రై చేసేయండి.
ALSO READ : మీరు ఎప్పుడు చనిపోతారో ముందుగానే చెప్పే యాప్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?