BigTV English

BB Telugu 8: ఆఖరి ఘట్టం.. టాప్ -5 ఫైనలిస్ట్స్ వీరే..!

BB Telugu 8: ఆఖరి ఘట్టం.. టాప్ -5 ఫైనలిస్ట్స్ వీరే..!

BB Telugu 8..బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించగా.. అందులో భాగంగానే శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి, హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.. ఇక నిన్నటి ఎపిసోడ్ తో ఫైనల్ కంటెస్టెంట్స్ జాబితా కూడా కొంతమేరకు క్లారిటీ వచ్చిందని చెప్పాలి.. టికెట్ టు ఫినాలే లో గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయ్యారు అవినాష్. ఇక టాప్ ఫైవ్ కి కూడా ఈ సీజన్లో అవినాష్ ఒక అడుగు ముందుకు వేసి, ఈ లిస్టులో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక మిగిలింది నలుగురు మాత్రమే. ఆ నలుగురిలో ప్రస్తుతం టైటిల్ రేసులో దూసుకు వెళ్తున్న మరో ఇద్దరు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఈ సీజన్ టైటిల్ రేస్ లో ఉన్న నిఖిల్, గౌతమ్ ఇద్దరూ కూడా లాస్ట్ వీక్ వరకు ఉంటారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలా చూసుకుంటే అవినాష్ తో పాటు నిఖిల్, గౌతం కూడా టాప్ ఫైవ్ లో కన్ఫర్మ్ అయినట్లే.. మిగిలింది ఇద్దరు మాత్రమే.. ఆ ఇద్దరు ఎవరు? ఆ అదృష్టం ఎవరికి వరిస్తుంది? అన్నది చూడాలి.


ఇకపోతే టికెట్ టు ఫినాలే టాస్క్ లో అవినాష్ గెలవడంతో పాటు ఈ వీక్ సేవ్ అవడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకొని.. మొదటి ఫైనలిస్ట్ గా నిలిచి, వైల్డ్ కార్డులో వచ్చిన మొదటి కంటెస్టెంట్ గా రికార్డు సృష్టించారు. అవినాష్ ఈ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు గా వచ్చినా సరే తనదైన టాస్క్ ల్లో సత్తా చాటుతూ మరోపక్క ఎంటర్టైన్ కూడా చేస్తున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న వాళ్లను కూడా ఓడిస్తూ వరుస టాస్కులు గెలుస్తూ ముందుకు దూసుకు వచ్చాడు. అందుకే ఈ సీజన్ ఫైనలిస్ట్ అయ్యాడు.. ఇదిలా ఉండగా మరోవైపు టాప్ -5 లో ఉంటారనుకున్న విష్ణు ప్రియ, ప్రేరణ , నబీల్ లకి నిన్న బ్లాక్ బాడ్జ్ ఇచ్చారు నాగార్జున.

ఇక ఇప్పటికే ఐదు మందిలో ముగ్గురు దాదాపు కన్ఫామ్ అయిపోయారు. ఇక మిగిలింది ఇద్దరే. ఆ ఇద్దరిలో ఎవరు రాబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే మరో వారం ఆటను బట్టి టాప్ ఫైవ్లోకి వెళ్లే ఆ ఇద్దరి కంటెస్టెంట్లను డిసైడ్ చేస్తారు. ఇకపోతే ఓటింగ్ చూస్తే మాత్రం కాస్త గందరగోళంగా మారిందనే చెప్పాలి. టాప్ ఫైవ్ లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ కాస్త ఓటింగ్ లిస్టులో వెనుకబడిపోతున్నారు. ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనిపించుకున్న టేస్టీ తేజ, యష్మి కూడా అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడంతో ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ టాప్ ఫైవ్ లో ఈసారి ఎవరు రాబోతున్నారు? ఎవరు సత్తా చాటబోతున్నారు? అనే విషయం తెలియాలి అంటే ఇంకో వారం రోజులు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే డిసెంబర్ 15వ తేదీన సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరగబోతోందని సమాచారం.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×