BigTV English

Sravan Month festivals 2024: శ్రావణ మాసంలో ముఖ్యమైన ఉపవాసాలు, పండుగలు.. వాటి తేదీలు ఇవే..

Sravan Month festivals 2024: శ్రావణ మాసంలో ముఖ్యమైన ఉపవాసాలు, పండుగలు.. వాటి తేదీలు ఇవే..

Sravan Month festivals 2024: శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది. శివ భక్తులు ఈ నెల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. రక్షాబంధన్, నాగ పంచమి, హరియాలీ తీజ్, శ్రావణ శివరాత్రి వంటి అనేక ముఖ్యమైన పండుగలు ఈ మాసంలో జరుపుకుంటారు. కాబట్టి శ్రావణ మాసం ఉపవాసాలు మరియు పండుగల పరంగా కూడా ముఖ్యమైనది. ఇది కాకుండా, శ్రావణ మాసంలోని అన్ని సోమ, మంగళవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ సోమవారాలు శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన రోజులు అని అంటారు. పార్వతీ దేవికి అంకితం చేయబడిన శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం పాటిస్తారు.


రేపటి నుంచే శ్రావణ మాసం ప్రారంభం..

శ్రావణ మాసం జూలై 22వ తేదీ సోమవారం అంటే రేపటి నుండి ప్రారంభమవుతుంది. తిరిగి ఇది ఆగస్టు 19వ తేదీ సోమవారంతో ముగుస్తుంది. ఈ శ్రావణ మాసంలో అనేక ముఖ్యమైన ఉపవాసాలు మరియు పండుగలు ఉంటాయి. అయితే ఈ నెలలో ఉండే ఉపవాసాలు మరియు పండుగల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


* 22 జూలై, సోమవారం – మొదటి శ్రావణ సోమవార వ్రతం
* 23 జూలై, మంగళవారం – మొదటి మంగళ గౌరీ వ్రతం
* 24 జులై, బుధవారం – చతుర్థి ఉపవాసం
* 27 జూలై, శనివారం – కాలాష్టమి, నెలవారీ కృష్ణ జన్మాష్టమి
* 29 జూలై, సోమవారం – రెండవ శ్రావణ సోమవారం ఉపవాసం
* 30 జూలై, మంగళవారం – రెండవ మంగళ గౌరీ వ్రతం
* 31 జూలై, బుధవారం – కామిక ఏకాదశి
* 2 ఆగష్టు , శుక్రవారం – శ్రావణ శివరాత్రి ( మహా శివరాత్రి తర్వాత, శ్రావణ శివరాత్రి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శ్రావణ శివరాత్రి నాడు ఉపవాసం పాటించి శివ-పార్వతిని పూజించడం ద్వారా, వివాహ అవకాశాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది )
* 5 ఆగస్టు, సోమవారం – మూడవ శ్రావణ సోమవారం ఉపవాసం
* 6 ఆగస్టు, మంగళవారం – మూడవ మంగళ గౌరీ వ్రతం, మాస దుర్గాష్టమి
* 8 ఆగస్ట్, గురువారం – వినాయక చతుర్థి
* 9 ఆగస్ట్, శుక్రవారం – నాగ పంచమి ( నాగ పంచమి రోజున, ఆచారాల ప్రకారం నాగ దేవతలను పూజించడం వలన కాలసర్ప దోషం తొలగిపోతుంది. ఇది జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కూడా తెస్తుంది. )
* 12 ఆగస్టు, సోమవారం – నాల్గవ శ్రావణ సోమవారం ఉపవాసం
* 13 ఆగస్టు, మంగళవారం – నాల్గవ మంగళ గౌరీ వ్రతం, మాస దుర్గాష్టమి
* 16 ఆగష్టు, శుక్రవారం – పుత్రదా ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం
* 19 ఆగస్ట్, సోమవారం – ఐదవ శ్రావణ సోమవారం ఉపవాసం, రక్షాబంధన్ ( రక్షాబంధన్, అన్నదమ్ముల మధ్య పవిత్ర సంబంధానికి సంబంధించిన పండుగ, శ్రావణ మాసం చివరి రోజు పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున, సోదరీమణులు రాఖీ కట్టుకుంటారు. )

Tags

Related News

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Tirumala Darshan: వరుస సెలవులు.. భక్తులతో సందడిగా మారిన తిరుమల

Shri Krishna Janmashtami: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కిటకిటలాడుతున్న దేవాలయాలు..

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

Big Stories

×