BigTV English

Budget 2024: ‘బడ్జెట్ లో ట్యాక్స్ విధానం సరళంగా ఉండాలి, మధ్య తరగతికి ఊరట నివ్వాలి’.. కేంద్రానికి అసోచమ్ సూచన

Budget 2024: ‘బడ్జెట్ లో ట్యాక్స్ విధానం సరళంగా ఉండాలి, మధ్య తరగతికి ఊరట నివ్వాలి’.. కేంద్రానికి అసోచమ్ సూచన

Budget 2024: మరో కొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2024-25 పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి ఊరట కలిగించేలా నిబంధనలు రూపొందించాలని .. అలా చేయడం వల్ల ప్రజల ఆర్థిక శక్తి పెరుగుతుందని ఆర్థిక మంత్రికి ది అసోసియేషన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచమ్) సూచనలు చేసింది.


మూడోసారి అధికారంలోక వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్ జూలై 23న లోక్ సభలో సమర్పిస్తారు. ఈ బడ్జెట్ లో కార్పొరేట్ పన్నులు తగ్గించాలని, పన్ను మినహాయింపులపై దృష్టి పెట్టాలని దీని వల్ల దేశం ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని అసోచమ్ విశ్లేషణ.

టాక్స్ విధానం సరళంగా ఉండాలి
”టాక్స్ విధానం సరళం చేస్తే దేశంలోకి పెట్టుబడులు వస్తాయి. వ్యాపార అనుమతులు పొందేందుకు కూడా వీలుంటుంది. దాంతో పాటు కార్పొరేట్ పన్నుల శాతం తగ్గించాలి, దశల వారీగా కొన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలి. దీని వల్ల భారత దేశంలో పన్ను విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది.. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది,” అని అసోచమ్ ప్రకటించింది.


ఇన్వెస్టెమెంట్ ఇన్ ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ.. ఇక్రా ప్రకారం.. ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఈ బడ్జెట్‌లో 4.9 నుంచి 5 శాతం ఉంటుంది. అయితే ఫిబ్రవరి 2024న ప్రవేశ పెట్టిన ఇంటరిమ్ బడ్జెట్ లో ఈ టార్గెట్ 5.1 శాతంగా ఉంది. అయితే క్యాపిటర్ ఎక్స్ పెండిచర్ టార్గెట్ 11.1 లక్షల కోట్ల టార్గెట్ లో ఏ మార్పు ఉండదు.

ఈసారి బడ్జెట్ లో దేశ ఆర్థిక అభివృద్ధి, తక్కువ ఆదాయం ఉన్న ప్రజలపై దృష్టి పెట్టాలని జూపర్ ఇన్ సూర్ టెక్ సహవ్యవస్థాపకుడు మయాంక్ గుప్త సూచించారు.

”ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం సెక్షన్ 80 సి పరిధిని పెంచాలి. దీని వల్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రజల సంఖ్య పెరుగుతుంది,” అని ఆయన అన్నారు.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

డెలాయిట్ ఇండియాలో పనిచేసే ఆర్థికవేత్త రుమ్కీ మజూమ్ దార్.. కేంద్ర ప్రభుత్వం.. ప్రొడక్ట్ లింక్ డ్ స్కీమ్ లపై ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ముఖ్యంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే వాటిపై దృష్టి సారించాలి. ఎలెక్ట్రానిక్స్, సెమికండక్టర్ చిప్స్ తయారీ రంగంతో పాటు టెక్స్ టైల్, హాండిక్రాఫ్ట్, లెదర్ ఉత్పత్తులును కూడా జాబితాలో చేర్చాలని ఆమె అన్నారు.

రెలిగెర్ ఫిన్ వెస్ట్ పంకజ్ శర్మ విశ్లేషణ ప్రకారం.. ఎం ఎస్ ఎంఈలకు వడ్డీలో సబ్సీడీ ఇవ్వాలి, ఈ రంగంలో సరళంగా రుణాలు పొందే విధానం రూపొందించాలి. ముఖ్యంగా డిజిటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులను ప్రొత్సహించే విధంగా నియమాలు ఉండాలి.

చివరగా అసోచమ్ సభ్యులు.. వ్యవసాయ రంగం కోసం విధానాలు రూపొందించాలని, రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టిసారించాలని అన్నారు. దీనికోసం కాంట్రాక్ట్ ఫార్మింగ్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులను ప్రొత్సహించే విధానాలు తీసుకురావాలని కేంద్రాన్ని సూచించారు.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×