Big Stories

Dharma Sastram : పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారని మీకు తెలుసా .?

Dharma Sastram

Dharma Sastram: మన ధర్మశాస్త్రాల ప్రకారం.. పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.

- Advertisement -

పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని మరొకరి చేతికి ఇచ్చి.. దానిని తీసుకోకుండానే మరణించిన వాడి కడుపున ఆ సొమ్ము తీసుకున్నవాడు పుత్రుడిగా పుడతాడు.

- Advertisement -

గత జన్మలో బాకీ పడిన మొత్తాన్ని ఈ జన్మలో తీర్చేందుకు కుమారుడిగా పుడతాడు.

పాత జన్మలోని మీ మీద ఉన్న పగను తీర్చుకోవటానికి.. ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

గత జన్మలో మీకు కీడు తలపెట్టి.. అందుకు తగిన శిక్షను అనుభవించని వాడు ఉంటే.. మీరు వాడి కడుపున పుట్టి వాడిని పుత్రుడిగా వేధించుకు తింటారు.

పూర్వ జన్మలో తాను ఎవరినుంచైనా సుఖం, సేవను పొంది ఉంటే.. ఈ జన్మలో వారి బాకీ తీర్చేందుకు కుమారుడిగా పుట్టి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.

పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకునేందుకు కుమారుడు జన్మిస్తాడు.

ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రుని రూపంలో జన్మించి, తన కర్మఫలాన్ని పరిసమాప్తి చేసుకుని మోక్షాన్ని పొందుతాడు.

ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారంగా తమ పని పూర్తి కాగానే.. మరణిస్తారు. వారి రుణం తీరకపోతే.. దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య – భర్త – సోదరుడు – పనిమనిషి – ఆవు – కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News