BigTV English

Sai Dharam Tej Updates : మామ గుడుంబా శంకర్…అల్లుడు గంజాయి శంకర్… ఊర మాస్ మూవీ లో మెగా మేనల్లుడు..

Sai Dharam Tej Updates : మామ గుడుంబా శంకర్…అల్లుడు గంజాయి శంకర్… ఊర మాస్ మూవీ లో మెగా మేనల్లుడు..

Sai Dharam Tej Updates : వైవిద్య భరితమైన కంటెంట్ ఉన్న చిత్రాలతో తనదైన శైలిలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న నటుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మిగిలిన ఈ తరం మెగా యాక్టర్లతో పోల్చుకుంటే…. తనదైన పందాలో ముందుకు పోతున్నాడు సాయిధరమ్ తేజ్. మొన్న విరూపాక్షతో మంచి సాలిడ్ హిట్ట అందుకున్న ధరమ్ తేజ్…ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో చిత్రంతో బాగా ఆకట్టుకున్నాడు. అదే జోరుతో.. ఈరోజు సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు.


డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ సరికొత్త చిత్రానికి మేకర్స్ గంజాయి శంకర్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కంప్లీట్ మాస్ మసాలాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరమ్ తేజ్ తో ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ మూవీ లో ధరమ్ తేజ పాత్ర ఒకప్పటి పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ మూవీ ని తలపించే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.

మీరాజాస్మిన్ పవన్ కాంబినేషన్లో వచ్చిన గుడుంబా శంకర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. గుర్తు రాని వాళ్ళకి పవన్ కళ్యాణ్ ప్యాంటు మీద ప్యాంటు వేసుకున్న చిత్రం అంటే వెంటనే గుర్తొస్తుంది. ఈ మూవీలో పవన్ సృష్టించిన మాస్ బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. 2004 లో ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించాడు. అప్పట్లో చిత్రానికి ఎవరేజ్ టాక్ వచ్చినప్పటికీ అందులో పవన్ యాక్షన్ మాత్రం మాంచి బజ్ క్రియేట్ చేసింది.


అయితే ఇప్పుడు…ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మామ రేంజ్ మాస్ యాంగిల్ ని సాయి ధరమ్ తేజ్ ప్రయత్నించబోతున్నాడు. అక్టోబర్ 17న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గ్లిమ్స్ వీడియోని కూడా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యరీత్యా కలిగిన ఇబ్బంది కారణంగా కాస్త బ్రేక్ తీసుకోవడంతో గంజాయి శంకర్ షూటింగ్ కాస్త లేట్ అవుతూ వచ్చింది.

అందుకే ఈనెల రాబోతున్న సాయి ధరమ్ తేజ పుట్టినరోజు సందర్భంగా మూవీ గురించి అనౌన్స్ చేసి…ఒక గ్లిమ్స్ వీడియో విడుదల చేసి…ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో డైరెక్షన్ బాధ్యతలు వహిస్తున్న సంపత్ నంది వరుస ప్లాపులతో బాధపడుతున్నాడు. మరోపక్క ఈ మూవీలో హీరోయిన్ గా చేయబోతున్న పూజా హెగ్డే.. తెలియని కారణాలవల్ల స్టార్ హీరోలతో చేయాల్సిన సినిమాలు అన్నీ మిస్ చేసుకుని మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక కమర్షియల్ గా సాలిడ్ హిట్టు లేని సాయి ధరమ్ తేజ రాబోయే చిత్రంపై ఆశలు మొత్తం పెట్టుకున్నాడు. ఇలా ముచ్చటగా ఈ ముగ్గురు గంజాయి శంకర్ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×