BigTV English

Raja Saab Trailer Time: భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి.. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి!

Raja Saab Trailer Time: భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి.. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి!

Raja Saab Trailer Time: పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas).. వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతి (Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కి అభిమానుల నుండి పెద్ద ఎత్తున రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ది రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా విడుదల తేదీ ఇదే అంటూ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ది రాజా సాబ్ ట్రైలర్ ను రేపు అనగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా.. సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ది రాజాసాబ్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని ప్రకటిస్తూ..” భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి” అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని అటు ప్రభాస్ కూడా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం గమనార్హం.

అనౌన్స్మెంట్ తో పాటు కొత్త పోస్టర్ కూడా..


ఇకపోతే ది రాజా సబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ తో పాటూ ఆకట్టుకునేలా పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో టీజర్ లో చూపించిన బిల్డింగ్ గేట్ కూడా కనిపిస్తోంది. దాని ముందు సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రభాస్ ఉన్న ఫోటో ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. మంటల్లో సంజయ్ దత్, ప్రభాస్ చేతులు చాచుతూ ఇచ్చిన స్టిల్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తోంది. మొత్తానికైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి దసరా స్పెషల్ గా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. మరి రేపు విడుదలయ్యే ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఏవిధంగా పెరిగిపోతాయో చూడాలి.

సినిమా విశేషాలు..

మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ , వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు ప్రభాస్. అలాగే ఈ ఏడాది డిసెంబర్లో స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాలు కూడా లైన్లో ఉంచారు ప్రభాస్.

also read:Vijay Thalapathi: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. మనసు ముక్కలైందంటూ!

 

Related News

Puri – Sethupathi: వాయిదా పడ్డ పూరీ మూవీ టైటిల్ – టీజర్.. తొక్కిసలాటే కారణమా?

Vijay Thalapathi: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. మనసు ముక్కలైందంటూ!

Anasuya: బికినీలో సెగలు పుట్టిస్తున్న రంగమ్మత్త.. చూపు పక్కకు తిప్పుకోనివ్వట్లేదుగా?

Saraswati : డైరెక్టర్ గా మారిన ప్రముఖ నటి, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

K – Ramp : బూతులు గురించి క్లారిటీ, లేడీ రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీనియర్ నరేష్

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Big Stories

×