BigTV English

Puri – Sethupathi: వాయిదా పడ్డ పూరీ మూవీ టైటిల్ – టీజర్.. తొక్కిసలాటే కారణమా?

Puri – Sethupathi: వాయిదా పడ్డ పూరీ మూవీ టైటిల్ – టీజర్.. తొక్కిసలాటే కారణమా?

Puri – Sethupathi:టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ప్రస్తుతం వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో తొలిసారి చేస్తున్న చిత్రం #పూరీసేతుపతి. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోయాయి. జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై జేబీ నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరీకనెక్ట్స్ బ్యానర్ పై అటు పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.


#పూరీసేతుపతి టీజర్, టైటిల్ లాంచ్..

ఇకపోతే ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను, టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో ఈరోజు మధ్యాహ్నం 1:00గంటకు టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని.. ఈ సందర్భంగా వీటిని రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్ తో సహా ప్రకటించారు మేకర్స్.

ఈవెంట్ ను వాయిదా వేసిన #పూరీసేతుపతి చిత్ర బృందం..


అయితే ఇప్పుడు ఈ టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ను వాయిదా వేస్తూ #పూరీసేతుపతి మూవీ టీమ్ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు ఒక పోస్ట్ రిలీజ్ చేస్తూ.. “తమిళనాడు కరూర్ లో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా ఈరోజు జరగాల్సిన టైటిల్ , టీజర్ లాంచ్ ఈవెంట్ #పూరీసేతుపతి బృందం వాయిదా వేసింది. ఈ ఘటనలో మరణించిన మృతులకు సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలవనున్నాము” అంటూ ఒక పోస్ట్ పెట్టింది చిత్ర బృందం.

త్వరలో కొత్త తేదీ..

ఇకపోతే ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ రిలీజ్ అవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా.. అటు తమిళనాడు కరూర్ లో జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ లాంచ్ ఈవెంట్ ను వాయిదా వేశారు. మొత్తానికైతే మరో కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.

also read:Raja Saab Trailer Time: భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి.. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి!

తమిళనాడు కరూర్ లో ఏం జరిగిందంటే..?

అసలు విషయంలోకి వెళ్తే.. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికలలో తన పార్టీ తరపున పోటీ చేయాలని ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన స్థాపించిన టీవీకే పార్టీ నేతృత్వంలో సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈయన ప్రసంగాన్ని వినడానికి అభిమానులు టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని కంట్రోల్ చేయడానికి పోలీసులకు కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట జరగగా.. మొత్తం 10మంది చిన్నారులు, 18 మంది మహిళలు చనిపోయారు. మరో 10 మంది పురుషులు చనిపోయినట్లు సమాచారం. అలాగే 50 మందికి గాయాలు కాగా.. వీరందరినీ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కి తరలించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే విచార ఘటనను దృష్టిలో పెట్టుకొని పూరిసేతుపతి టీం తమ ఈవెంట్ ను వాయిదా వేసింది.

Related News

Raja Saab Trailer Time: భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి.. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి!

Vijay Thalapathi: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. మనసు ముక్కలైందంటూ!

Anasuya: బికినీలో సెగలు పుట్టిస్తున్న రంగమ్మత్త.. చూపు పక్కకు తిప్పుకోనివ్వట్లేదుగా?

Saraswati : డైరెక్టర్ గా మారిన ప్రముఖ నటి, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

K – Ramp : బూతులు గురించి క్లారిటీ, లేడీ రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీనియర్ నరేష్

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Big Stories

×