E-Paper
Advertisement

Guruwar Ke Upay: గురువారం లవంగాలతో.. ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయ్

Guruwar Ke Upay: గురువారం లవంగాలతో.. ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయ్
Advertisement

Guruwar Ke Upay: గురువారం అంటేనే బృహస్పతి, మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మన జాతకంలో గురు గ్రహం బలంగా ఉంటే సంపద, ఐశ్వర్యం , కార్యసిద్ధి లభిస్తాయి. కానీ, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి లవంగాలతో చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రం చెబుతోంది. గురువారం నాడు లవంగాలతో ఎలాంటి ఉపాయాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

గురువారం లవంగాల పరిహారం.. అప్పుల బాధల నుంచి విముక్తికి మార్గం

హిందూ సంప్రదాయంలో లవంగాలను కేవలం మసాలా దినుసులగానే కాకుండా.. పూజా కార్యక్రమాల్లో, తంత్ర శాస్త్రంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. లవంగం ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూలతను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది.

Advertisement

1. అప్పుల బాధలు తొలగడం :

మీరు తీసుకున్న అప్పులు తీరక, మానసిక ఒత్తిడికి గురవుతుంటే ఈ ఉపాయం చేయండి. గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత.. 5 లవంగాలను తీసుకుని ఒక ఎర్రటి క్లాత్ లో చుట్టి ఉంచండి. దీనిని లక్ష్మీదేవి లేదా మహావిష్ణువు పటాల వద్ద ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. పూజ ముగిసిన తర్వాత ఆ మూటను మీ బీరువాలో లేదా డబ్బులు ఉంచే చోట పెట్టండి. ఇలా చేయడం వల్ల ధన లాభం కలిగి, అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి.

2. పనుల్లో ఆటంకాలు తొలగడం:

చాలా మందికి చేతి దాకా వచ్చిన పని చివరి నిమిషంలో ఆగిపోతుంటుంది. దీనిని తొలగించుకోవడానికి, గురువారం నాడు ఒక నిమ్మకాయను తీసుకుని అందులో 4 లవంగాలను గుచ్చండి. “ఓం శ్రీ హనుమతే నమః” అనే మంత్రాన్ని 21 సార్లు జపించి, ఆ నిమ్మకాయను మీతో పాటు తీసుకువెళ్లండి. దీని వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.

3. ఆర్థిక స్థిరత్వం కోసం:

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గురువారం సాయంత్రం వేళ, ఇంటి పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి.. అందులో రెండు లవంగాలు వేయండి. ఇలా ప్రతి గురువారం చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోయి, మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది.

4. సుఖ సంతోషాల కోసం:

ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. గురువారం నాడు కర్పూరం మీద రెండు లవంగాలు పెట్టి వెలిగించండి. ఆ పొగను ఇల్లంతా చూపించండి. దీనివల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

Also Read: ఒంట్లో నీరసాన్ని తగ్గించి.. బలాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ !

గుర్తుంచుకోవాల్సిన నియమాలు:

ఈ పరిహారాలు చేసేటప్పుడు భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం.

పూజకు ఉపయోగించే లవంగాలు విరిగిపోకుండా, పైన మొగ్గ ఉన్నవి మాత్రమే ఎంచుకోవాలి.

గురువారం నాడు మాంసాహారం, మద్యం, చెడు మాటలకు దూరంగా ఉండాలి.

అప్పుల బాధల నుంచి బయటపడాలంటే మన కష్టార్జితంతో పాటు దైవ బలం కూడా తోడవాలి. పైన పేర్కొన్న చిన్నపాటి లవంగాల పరిహారాలు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయి.

Also Read: సముద్ర తీరంలో వెలిసిన అద్భుతం.. సోమనాథ్ ఆలయ విశేషాలివే !

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×