
Tulsi Kota : పవిత్రమైన కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ, సోమవారాలలో శివకేశవులకు ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు.ఏకాదశి రోజున విష్ణు భగవానుడు క్షీరసాగరమధనం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ఇష్టమైన తులసి బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు.అందుకోసమే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసికోటకు ఎంతో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.
ఇలా పూజలు చేయడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి చెట్టును పూజించడం వల్ల ఈతిబాధలు తొలగిపోతాయి. సకల సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని వేద పండితులు తెలియజేస్తున్నారు
దేవతా వృక్షాల్లో ప్రధానమైంది తులసి. తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు రాగి పాత్రను ఉపయోగించాలి. ఇంట్లో వాడే గ్లాసులు , చెంబులు వాడరాదు. వాటితో జలం పోస్తే ఎంగిలి పోసినట్టే. ప్రసాదాలు కూడా ప్రత్యేకపాత్ర వాడాలి. ఒకవేళ పాతవి వాడాల్సి వస్తే ఆ పాత్రను స్టవ్ మీద వెలిగించి అప్పుడే ఉపయోగించాలి. తులసి కోట చుట్టూ 11 సార్లు ప్రదక్షణలు చేయాలి . ఒక వేళ తులసి కోట చుట్టూ తిరిగే స్థలం లేకపోతే పదకొండ సార్లు ఆత్మ ప్రదక్షణ చేయాలి. తర్వాత పసుపు, కుంకుమతో పూజించాలి. తర్వాతే అగరబత్తీలు వెలిగించి అమ్మకు నమస్కరించాలి.
హిందువులు ప్రతి రోజూ తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క లో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని ప్రతి రోజూ తులసి మొక్కకు నీళ్లు పోయడం.. తులసి మొక్కని పెంచడం చాలా ముఖ్యం. తెలియక కొంత మంది తులసి మొక్క వద్ద కొన్ని తప్పులు చేయడం వల్లే కష్టాలు కొని తెచ్చుకుని ఇబ్బందులు పడుతుంటారు.
తులసి మొక్క చుట్టుపక్కల ఎప్పుడు కూడా చెత్త చెదారం ఉండకూడదు అని పండితులు అంటున్నారు. ఒకవేళ కనక తులసి కోట ఉండే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దాని వలన లక్ష్మీదేవి కి కోపం వస్తుందట.అలానే చీపురుకట్టను తులసి మొక్క దగ్గర పెట్టకూడదు ఇది కూడా అస్సలు మంచిది కాదు.