Lokesh kanakaraj : తమిళ ఇండస్ట్రీలో వరుస హ్యాట్రిక్ విజయాలను అందుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ లలో ఒకరు లోకేష్ కనకరాజ్.. ఈమధ్య ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన స్టార్ హీరోలు సినిమాలన్నీ కూడా మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి.. రీసెంట్గా కూలీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈయన హీరో కార్తీతో ఖైదీ 2 సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించిన టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ తర్వాత నెక్స్ట్ ఏ హీరోతో మూవీ చేస్తాడా అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమధ్య లోకేష్ కనకరాజు హీరోగా కూడా ఎంట్రీ పోతున్నట్లు తెలిసిందే.. మరి ఆయన నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తమిళ హీరో కార్తీతో లోకేష్ కనకరాజ్ గతంలో ఖైదీ మూవీని తెరకెక్కించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు పార్ట్-2 మూవీని తెరకెక్కిస్తున్నాడు. 75 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేసి మరో కొత్త సినిమాలను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు డైరెక్టర్. ఈసారి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న ఆసక్తి కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైంది. ఇప్పటికే దీనిపై ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. లోకేష్ కనకరాజు నెక్స్ట్ హీరో అజిత్ తో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. మరి అజిత్ ఈ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా వీరిద్దరి కాంబోలో మూవీ అనే వార్తలు విన్న అజిత్ అభిమానులు నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు. త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read :ఇదేం ట్రెండ్ బాబు.. మెడలో నెక్లేస్ తో అల్లు శిరీష్..ఫోటోలు వైరల్..
లోకేష్ కనకరాజు ప్రస్తుతం హీరోగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈయనహీరోగా నటిస్తున్న కొత్త మూవీ దర్శకుడిగా అరుణ్ మాదేశ్వరన్ వ్యవహరించనున్నాడని టాక్.. ఈ మూవీలో లోకి మామ కి జోడిగా వామికా గబ్బిని సెలెక్ట్ చేశారు.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది ఈ హీరోయిన్.. గ్లామర్, నటన రెండింటిని మిక్స్ చేస్తే ఈ అమ్మడు. తమిళ్లో ఇలాంటి బడా ప్రాజెక్టులో వామిక హీరోయిన్గా కనిపించనుండడంతో.. ఈమెకి సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి.. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది?. డైరెక్టర్ గా సక్సెస్ అయిన లోకేష్ కనకరాజ్ హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి..