Tollywood Directors:సాధారణంగా జీవితంలో ఓటమి గెలుపు ఎలా అయితే సహజమో.. సినిమాల విషయంలో కూడా హిట్ ఫ్లాప్ అంతే సహజం.. కానీ అసలు ఫ్లాప్ అంటే ఏంటో కూడా తెలియని దర్శకులు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు వారు చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను అందించి వారికంటూ ఒక స్థానాన్ని అందించింది. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఓటమి అంటే ఏంటో చవిచూడని ఆ దర్శకులు ఎవరు? అటు ఓటమి చవిచూసినా.. బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన దర్శకులు కూడా ఉన్నారు. మరి వారెవరు? అసలు వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టాయి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీని శాసించే డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి (Rajamouli)..పాన్ ఇండియా చిత్రాలకు తెర లేపిన దర్శకుడిగా రాజమౌళి పేరు దక్కించుకున్నారు. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి.. ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం తెలుగులో నటించేలా ఆసక్తి రేకెత్తిస్తూ సినిమాలు చేస్తూ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై కూడా నడిచి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకులు జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాజమౌళి ఇప్పటివరకు 12 చిత్రాలు చేయగా.. ఈ 12 చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు ఈ చిత్రాలన్నీ కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.4,198 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించాయి.
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సుకుమార్(Sukumar ) దర్శకుడిగా ఆర్య సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని ఆరంభించారు. ఇప్పటివరకు 9 చిత్రాలు చేసిన ఈయన.. ఈ తొమ్మిది చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును దక్కించుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.2,557 కోట్ల గ్రాస్ వసూలు చేశారు.
మొదటి సినిమా కోసం ఆస్తులనే తాకట్టు పెట్టిన సందీప్ రెడ్డివంగా(Sandeep Reddy Vanga).. అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ అంటూ మూడు చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలతో సంచలన దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఈయన.. బాక్సాఫీస్ వద్ద రూ.1,346కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశారు.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న నాగ్ అశ్విన్ (nag Ashwin) మహానటి, కల్కి 2898 ఏడి చిత్రాలతో సంచలనం సృష్టించారు . ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.1,093 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాయి.
ALSO READ:Malaika Arora: మలైకా బోల్డ్ స్టేట్మెంట్.. కోరిక తీరాలంటే పెళ్లి అక్కర్లేదు అంటూ!
ఇటీవల పవన్ కళ్యాణ్ తో ఓజీ అంటూ సినిమా చేసి ఆకట్టుకున్న సుజీత్(Sujith).. ప్రభాస్ తో సాహో సినిమా చేసి మెప్పించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఇప్పటివరకు మూడు చిత్రాలు చేయగా.. ఈ మూడు చిత్రాలతో రూ.877 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు చేస్తూ ఇప్పటివరకు ఎనిమిది సినిమాలతో ఓటమెరుగని దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. ఇక ఈ ఎనిమిది చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1,077 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి.
వీరితోపాటు
త్రివిక్రమ్ – 11 చిత్రాలు – రూ. 1,165 కోట్లు
కొరటాల శివ – 7 చిత్రాలు – 1,163 కోట్లు
బోయపాటి శ్రీను – 12 చిత్రాలు – రూ.664 కోట్ల గ్రాస్
బాబీకొల్లి – 6 చిత్రాలు – రూ.647 కోట్ల గ్రాస్
గోపీచంద్ మల్లినేని – 8 సినిమాలు – రూ.700 కోట్ల గ్రాస్
ప్రశాంత్ వర్మ – 4 సినిమాలు – రూ.330 కోట్ల గ్రాస్
శైలేష్ కొలను – 4 సినిమాలు రూ.199 కోట్ల గ్రాస్
శ్రీకాంత్ ఓదెల – 1 సినిమా – రూ. 130 కోట్ల గ్రాస్