Nigar Sultana : బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ (Nigar Sultana) పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల బంగ్లా జట్టులో స్థానం కోల్పోయిన తన మాజీ సహచరురాలు జహనారా ఆలం (Jahanara alam) బంగ్లా కెప్టెన్ పై ఆరోపణలు చేసింది. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానాకి కొట్టడం అలవాటు అని.. దుబాయ్ టూర్ లో కూడా రూమ్ కి పిలిపించి మరీ జూనియర్ ని కొట్టిందని చెప్పారు. ఇక ఐసీసీ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఉమెన్స్ ప్రపంచ కప్ భారత్ తో జరిగిన మ్యాచ్ సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ముఖ్యంగా ఆరోపించింది జహనారా ఆలం.
Also Read : Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాటర్ తక్కువే అంటూ !
ప్రస్తుతం ఈ ఆరోపణలు బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలలో కలకలం రేకెత్తిస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జహనారా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ నిగర్ సుల్తానా కోటి జట్టులోని జూనియర్ ఆటగాళ్లను కొట్టడం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని తెలిపింది. “ఇది కొత్త విషయం ఏమి కాదు. జోటి నిత్యం జూనియర్లను ఏదో ఓ సందర్భంలో కొడుతూనే ఉంటుంది. 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా కొందరూ జూనియర్లు నాకు చెప్పారు. దుబాయ్ టూర్ సమయంలో కూడా ఓ జూనియర్ ని గదికి పిలిపించి మరీ చెంప దెబ్బ కొట్టింది” అని జహనారా సంచలన ఆరోపణలు చేసింది.
ఇక క్రికెట్ లో జహనారా 52 వన్డేలు, 83 టీ-20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. 2024లో ఈ సీనియర్ పేసర్ చివరిసారిగా బంగ్లాదేశ్ జట్టు తరపున ఆడింది. బోర్డులోని అంతర్గత రాజకీయాలు అనేక మంది సీనియర్ ప్లేయర్ల కెరీర్ ను దెబ్బ తీశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జహనారా ఆలం సిడ్నీలో ఉంటూ మానసిక ఒత్తిడి కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నట్టు తెలిపింది. “నేనే కాదు. ప్రతీ ప్లేయర్ ఏదో ఒక విధంగా బాధితురాలే. ఇక్కడ కొందరికీ మాత్రమే ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయి. 2021 కరోనా అనంతరం జరిగిన క్యాంపులో సీనియర్లను దూరం చేయడం ప్రారంభం అయింది. అప్పుడు నేను బంగ్లాదేశ్ గేమ్స్ లోని మూడు జట్లలో ఓ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాను. మిగతా రెండు జట్ల కెప్టెన్లు జోటి, షర్మిన్ సుల్తానా, అప్పటి నుంచి సీనియర్ల పై ఒత్తిడి మొదలైంది” అని ఆరోపించింది. బంగ్లాదేశ్ మహిళల జట్టు అంతర్జాతీయ వేదికపై ప్రశంసనీయమైన ప్రగతి, ఐక్యతను ప్రదర్శిస్తున్న సమయంలో ఇలాంటి నిందారోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనే చెప్పాలి. ఆమె చేసినటువంటి ఆరోపణలకు మాత్రం ఎలాంటి ఆధారాలు లభించకపోవడం గమనార్హం.
Also Read : PM MODI: వరల్డ్ కప్ టైటిల్ టచ్ చేయకపోవడంపై ట్రోలింగ్..ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారంటే ?