BigTV English
Advertisement

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Project Vishnu: ప్రాజెక్ట్ విష్ణు.. పురాణాల్లోని విష్ణు భగవానుడి స్ఫూర్తితో లెటెస్ట్‌ టెక్నాలజీని మిక్స్‌ చేసి DRDO ఓ అద్భుతాన్ని సృష్టించబోతుంది. ఇంతకీ ఏంటీ ఈ ప్రాజెక్ట్‌ విష్ణు.. దాని వివరాలేంటి? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భారత రక్షణ వ్యవస్థలో వచ్చే మార్పులేంటి?


శత్రువు వెన్నులో వణుకు పుట్టించే ఆయుధం..
శత్రువు మనపై దాడి చేయాలంటే భయపడాలి.. తెగించి యుద్ధానికి దిగాడా.. దెబ్బకు తోక ముడిచేలా చేయాలి. అలా తోకజాడించే దేశాలకు బుద్ధి చెప్పడం కోసం ఓ మహత్తరమైన మిసైల్‌ను సిద్ధం చేస్తున్నారు భారత శాస్త్రవేత్తలు. అదే విష్ణు మిసైల్. మహాభారతంలో వాడిన నారాయణ అస్త్రం, శక్తి ఆయుధంలాంటి వాటి స్ఫూర్తితో విష్ణు మిసైల్‌ను సిద్ధం చేస్తోంది భారత్‌.

శత్రు దేశం ఎక్కడున్నా అక్కడికి వెళ్లి నాశనం..
ఇంతకీ ఏంటీ ప్రాజెక్ట్ విష్ణు.. ? డిఫెన్స్‌ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్ లెటెస్ట్‌గా డెవలప్‌చేస్తున్న హైపర్ సోనిక్ మిసైల్ ప్రోగ్రామ్‌కు ప్రాజెక్ట్ విష్ణుగా నామకరణం చేసింది. ఎలాగైతే విష్ణువు సర్వవ్యాప్తుడో.. ఈ మిసైల్‌ కూడా శత్రు దేశం ఎక్కడున్నా అక్కడికి వెళ్లి నాశనం చేస్తుందనేలా ఈ ప్రాజెక్ట్‌కు ఇలా నామకరణం చేశారు.


10 వేల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేధించే మిసైల్
ఇప్పటికే ఖండాంతర క్షిపణుల తయారీలో దూసుకుపోతున్న భారత్.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్ట్‌ విష్ణులో భాగంగా 10 వేల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేధించగల హైపర్‌సోనిక్ మిసైల్‌ను అభివృద్ది చేస్తోంది. ఇప్పటికే చాలా ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మిసైల్‌కు సంబంధించిన స్క్రామ్ జెట్‌ ఇంజిన్ విషయంలో మంచి ప్రొగ్రెస్ ఉందని అధికారులు తెలిపారు.

14 గంటలు గాలిలో సాగి 15 వేల కిలోమీటర్ల దూరం
రష్యా ఇటీవల పరీక్షించిన కొత్త హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ 14 గంటలు గాలిలో ప్రయాణించి 15 వేల కిలోమీటర్ల దూరం వరకు చేరగలదని నిరూపించింది. ఇప్పుడు భారత్‌ కూడా ఇలాంటి మిసైల్‌ను రూపొందించేందుకు చాలా ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. భారతీయ రక్షణ పరిశోధన సంస్థ ఈ మిసైల్‌ను డెవలప్ చేస్తోంది. ఎక్స్‌టెండెడ్ లాంగ్ డ్యూరేషన్ హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది. అత్యంత వేగం, కచ్చితత్వం,విస్తృత పరిధి దీని సొంతం. ఇది మాక్‌-8 వేగంతో దూసుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అంటే గంటకు 11 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. శత్రు దేశాల రాడార్‌కు దొరకకుండా వేగాన్ని మార్చుకుంటూ లక్ష్యాన్ని చేధిస్తోంది ఈ మిసైల్.

అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలకే పరిమితమైన టెక్నాలజీ
హైపర్‌సోనిక్‌ మిసైల్ టెక్నాలజీ ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలకే ఉంది. ప్రాజెక్ట్ విష్ణుతో భారత్‌ కూడా ఆ జాబితాలో చేరబోతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భారత్‌ అమ్ములపొదిలోకి సుదర్శనచక్రం చేరినట్టే. ఎందుకంటే విష్ణు మిసైల్ పాకిస్థాన్‌ను పూర్తిగా కవర్ చేయగలదు.. అదే సమయంలో చైనాలోని కీలక వ్యూహత్మక ప్రాంతాలను చేరగలదు. ఈ మిసైల్‌ 2 వేల కిలోలున్న న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌లను మోసుకెళ్లగలదు

వేడిని ఎక్కువ సమయం తట్టుకోగలిగే మెటల్స్‌
ఈ మిసైల్‌ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ఇప్పటికి కొన్ని చాలెంజెస్‌ సైంటిస్టుల ముందు ఉన్నాయి. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి.. అంత వేడిని ఎక్కువ సమయం తట్టుకోగలిగే బాడీని తయారు చేయాల్సి ఉంటుంది. .

పూర్తి స్థాయిలో మాక్ -10 వరకు మిసైల్ వేగం..
ప్రస్తుతం నరేంద్రమోడీ అధ్యక్షత వహించే భద్రతా క్యాబినెట్‌ ముందు దీనికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్కసారి ఇక్కడ క్లియర్ అయితే.. అతి త్వరలోనే ఈ మిసైల్‌ను టెస్ట్ చేయనున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మొదటి దశలో మాక్ -8 వేగం ఉన్నా.. పూర్తి స్థాయిలో మాక్ -10 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక దీనిని పరీక్షించడం పూర్తైతే.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది.

Related News

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Big Stories

×