Gambhir-Shubman Gill: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ నాలుగో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. క్వీన్స్‌ల్యాండ్ లోని కర్రారా ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే మూడు టీ20లు జరగగా… ఈ మూడింటిలో గిల్ అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోను మెరువలేదు. మొదటి మూడు మ్యాచ్ లలో 37, 5 అలాగే 15 పరుగులు వరుసగా సాధించాడు. మొత్తం కలిపి 50 పరుగుల వరకు మాత్రమే చేశాడు. అటు వన్డే సిరీస్ లో కూడా గిల్ సాధించింది ఏమీ లేదు. అక్కడ కూడా విఫలమయ్యాడు గిల్. అయితే, టీ20 వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఇంత అత్యంత దారుణంగా ఆటతీరును కనబరచడంపై గౌతమ్ గంభీర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
దారుణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ పై గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ గా ఉన్నారట. అంతేకాదు నాలుగో టీ20 కంటే ముందు అంటే బుధవారం రోజున గిల్ కు క్లాస్ కూడా పీకారట గౌతమ్ గంభీర్. నీకు సోకు ఎక్కువ అయింది.. మ్యాటర్ తక్కువ అయింది అంటూ మండిపడ్డారట. ఫామ్ లోకి నువ్వు రాకపోవడంతో టీమిండియా ఓడిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారట గౌతమ్ గంభీర్. నాలుగో టీ20లో అయినా బాగా ఆడు.. లేకపోతే కష్టమే అంటూ హెచ్చరించారట. గ్రౌండ్ లోనే అందరూ ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో గిల్ ను పక్కకు తీసుకువెళ్లి, గౌతమ్ గంభీర్ క్లాస్ పీకినట్లు వీడియో వైరల్ అయింది. మరి గౌతమ్ గంభీర్ ఆదేశాల మేరకు బాగా ఆడతాడా? మరోసారి గిల్ విఫలమవుతాడా ? అనేది చూడాలి.
స్వదేశంలో అద్భుతంగా ఆడుతున్న గిల్ విదేశీ గ్రౌండ్స్ లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై బౌన్సులు వస్తే భయపడిపోతున్నాడు గిల్. వన్డేల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన గిల్, టీ20లో కూడా ఇదే ప్రదర్శన చూపిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్లను చూస్తే భయపడిపోతున్నాడు. బౌన్సర్ వస్తే దెబ్బలు తగిలించుకుంటున్నాడు కానీ.. బౌండరీ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇలా అద్వాన పరిస్థితిలో గిల్ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఇవాళ టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టి20 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచాయి రెండు జట్లు. మరో రెండు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. గత రికార్డుల ప్రకారం ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
Gautam Gambhir and Shubman Gill were seen having a long intense discussion during the practice session.
The chat possibly about Gill’s T20 form, reflected his eagerness to improve and learn. With his work ethic and hunger to bounce back Gill looks determined to regain top form… pic.twitter.com/mJyl8GGmo5
— GillTheWill (@GillTheWill77) November 5, 2025