E-Paper
Advertisement

Puja mistakes: పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులేంటో తెలుసా..?

Puja mistakes: పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులేంటో తెలుసా..?
Advertisement

Puja mistakes: పూజ చేసేటప్పుడు అ తప్పులు అసలు చేయకూడదట. తెలిసి చేసినా తెలియక చేసినా మీరు ఎంత పూజ చేసినా అది వృథా అవుతుందని పండితులు సూచిస్తున్నారు. మరి పూజ చేస్తున్నప్పుడు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిత్య పూజ చేసేటప్పుడు తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు పూజా ఫలాన్ని తగ్గిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయట. పూజ చేసే సమయంలో పవిత్రతతో పాటు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు పండితులు.

Advertisement

శౌచం మరియు శుభ్రత: ఎప్పుడైనా సరే స్నానం చేయకుండా దైవ కార్యాలు లేదా దేవుడి పూజా సామాగ్రిని తాకకూడదట. పూజా సమయంలో ఉతికిన శుభ్రమైన వస్త్రాలనే ధరించాలట.. చిరిగిన లేదా అపరిశుభ్రమైన దుస్తులతో పూజ చేయకూడదట.

దీపారాధన నియమాలు: దేవుడి ముందు దీపం ఎప్పుడూ వెలిగించినా..? అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదట. ముందుగా వేరొక వత్తిని వెలిగించి దానితో దీపారాధన కుందులలోని వత్తులను వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలట. అలాగే ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదట.

Advertisement

పూలు మరియు పత్రాలు: పూజలో ఉపయోగించే పూలు వాడిపోయిన, కింద పడిన లేదా పురుగులు ఉన్న వాటిని దేవుడికి సమర్పించకూడదట. పూలను చెట్ల నుంచి కోసేటప్పుడు గోళ్లను ఉపయోగించకూడదట. అలాగే స్నానం చేయకుండా కోసిన పూలు పూజకు పనికిరావట. ముందు రోజు పూజ చేసిన పువ్వులను (నిర్మాల్యం) తీసేయకుండా కొత్త పూలతో పూజ చేయకూడదట.

పూజా విధానంలో తప్పులు: దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు లేదా హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే కాకుండా.. పూజ ప్రారంభంలో కూడా గంట వాయించాలట. కానీ అనవసరంగా ఎక్కువసేపు గంట కొట్టకూడదట. అలాగే పూజ చేసేటప్పుడు నేరుగా నేల మీద కూర్చోకూడదట. పీట లేదా చాప (ఆసనం) మీద మాత్రమే కూర్చోవాలట. ఇక పూజ పూర్తయిన తర్వాత దేవుడికి వెన్ను చూపిస్తూ వెనక్కి తిరగకూడదట. కొంచెం దూరం వెనక్కి నడిచిన తర్వాతే పక్కకు తిరగాలట.

దేవుడికి నైవేద్యం: దేవుడికి నైవేద్యం పెట్టక ముందే వండిన పదార్థాలను రుచి చూడకూడదట.. ఇంకా నైవేద్యాన్ని నేరుగా నేల మీద పెట్టకుండా దాని కింద ఒక చిన్న పీట లేదా కనీసం నీటితో చిన్న ముగ్గు వేసి ఉంచాలట.

మనస్సు మరియు మాట: పూజ చేస్తున్నప్పుడు ఎవరి మీదైనా కోప్పడటం, గట్టిగా అరవడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వంటివి చేయకూడదట. మనస్సు ప్రశాంతంగా, దైవచింతనతో ఉండాలట. అలాగే మంత్రాలు లేదా స్తోత్రాలు చదివేటప్పుడు స్పష్టంగా.. అర్థవంతంగా చదవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: 12వ తేదీలో పుట్టిన వారికి జీవితంలో అత్యంత కీలకమైన సమయం ఎప్పుడు వస్తుందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×