E-Paper
Advertisement

Time to worship God: దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది ?

Time to worship God: దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది ?
Advertisement

 


Time to worship God: హిందువులు దేవుళ్లను భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి రోజు ఇంట్లో దేవుడికి ఉదయం, సాయంత్రం వేళ పూజలు చేస్తూ తమ కోర్కెలు తీర్చాలని ప్రార్థిస్తుంటారు. అయితే కొంద మంది ప్రతి రోజు రెండు పూటలు పూజలు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రం పూజలు చేస్తుంటారు. అయితే దేవుడికి ఒకే పూట పూజ చేసినా కూడా కరునిస్తాడట. కానీ అది ఏ వేళలో పూజించాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మరి ఏ సమయంలో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

దేవుడిని ఉదయం వేళ పూజించడం కంటే సాయంత్రం వేళ పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం దక్కాలనుకునే వారు సాయంత్రం వేళ పూజలు చేస్తే దేవుడి అనుగ్రహం దక్కుతుందని పండితులు అంటున్నారు. అయితే దేవుడిని పూజా సమయంలో చేసే దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది. కానీ దీపారాధాన చేసే సమయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. దేవుడి వద్ద పెట్టే దీపాన్ని సాధారణంగా అగ్గిపుల్లతో వెలిగిస్తుంటాం. అయితే అలా వెలిగించటం అపచారమట. దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో క్యాండిల్ ను వెలిగించి ఆ తరువాత కొవ్వొత్తితోనే దీపాలను వెలిగిస్తే మంచిదట. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం పొందినవారు అవుతారని పండితులు చెబుతున్నారు.

Also Read: ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఫలితం ఉంటుందో తెలుసా?

Advertisement

దేవుడికి నైవేద్యం తప్పక పెట్టాలి. నీరు, నైవేద్యం పెట్టాకే పూజ చేయాలని పండితులు అంటున్నారు. అంతేకాదు పూజను ఏ సమయంలో చేసినా కొన్ని నియమాలు పాటించాలి.పూజ చేసే సమయంలో ఇంటి తలుపు తెరిచే ఉంచాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు, బయట చెత్తను ఉంచకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, అందమైన ముగ్గులు వేయాలి. ఎవరి ఇంటి ముందు అలంకరణ చక్కగా ఉంటే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రతీ రోజు ఎంత బిజీ లైఫ్ ఉన్నా పూజ చేయడం మాత్రం మానకూడదు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×