E-Paper
Advertisement

Saturn Transit 2024: ఈ రాశులపై శని ఆగ్రహం.. నవంబర్ 15 వరకు అష్టకష్టాలు

Saturn Transit 2024: ఈ రాశులపై శని ఆగ్రహం.. నవంబర్ 15 వరకు అష్టకష్టాలు
Advertisement

Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మనం చేసిన పనులకు ఫలితాలను ఇస్తాడని చెబుతుంటారు. మనం చేసిన పనులకు అనుగుణంగానే శని శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తాడని నమ్ముతారు. శని తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నపుడల్లా శుభ, అశుభ ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో శని ప్రభావం శక్తి వంతంగా మారుతుంది. ఇటువంటి సమయంలో శని శుభదృష్టి ఉన్న రాశులకు శుభ ప్రభావాలను కలిగిస్తాడు.

చెడు స్థానంలో ఉన్న వారికి అశుభ ఫలితాలను అందిస్తాడు. ఈ సమయం ఆయా రాశుల వారికి చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. దృక్ పంచాంగం ప్రకారం జూన్ 30. 2024 ఉదయం 12:35 నుంచి శని కుంభరాశిలో తిరోగమన దిశలోనే సంచరిస్తున్నాడు. నవంబర్ 15 రాత్రి 07:51 వరకు శని తిరోగమన దిశలోనే కదులుతూ ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని తిరోగమన కదలిక కొన్ని రాశుల వారి జీవితాల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇదిలా ఉంటే మరికొన్ని రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శని తిరోగమనం వల్ల ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేషరాశి:
శని తిరోగమనం సమయంలో మేష రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కొంటారు. ఆస్తి సంబంధిత విషయాల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు మీకు ఎదురవుతాయి. ఆందోళన చెంద దకండి నిరాశ అనుభూతి సమస్యలు ఎదురైనప్పుడు ఆలోచించి ముందడుగు వేయండి. తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఈ సమయంలో మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితం కూడా అంతగా బాగుండదు.

కర్కాటక రాశి:
జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కర్కాటక రాశి వారికి కొంత కష్టంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగం మారడానికి మీరు ప్లాన్ చేయకండి . మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అతిగా ఆలోచించడాన్ని ముందుగా మానుకోండి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. మానసికంగా శారీరకంగా మీరు బాగుండేందుకు ఇవి కారణం అవుతాయి. సహోద్యోగులతో గొడవలకు దిగకండి. మీకు ఇచ్చిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయండి.

Advertisement

కన్య రాశి:
ఈ రాశి వారికి శని తిరోగమనం ఒత్తిడిని పెంచుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు ఈ సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం గురించి మనసు ఆందోళన చెందుతుంది. ప్రమోషన్లకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితాలను పొందలేరు. కుటుంబ సమస్యలు బాగా పెరుగుతాయి. ఈ సమయంలో మీకు కష్టాలు ఎదురవుతాయి. మీ మనసు కలత చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల వ్యక్తుల జీవితాల్లో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు, ఆస్తి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నిరాశ, ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తోబుట్టువులతో కూడా సంబంధాలు చెడిపోతాయి.

Also Read: వచ్చే ఏడాది వరకు ఈ 5 రాశుల వారు శని, ధ్యేయ నియంత్రణలో ఉంటారు

మకర రాశి:
శని తిరోగమనంలో మకర రాశి వారు తమ వృత్తికి సంబంధించిన విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. కొత్త సంబంధాలను ఈ సమయంలో ప్రారంభించకుండా ఉంటే మంచిది. మీ సంబంధాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ సమస్యల నుంచి పరిష్కారం దొరకదు . అంతే కాకుండా మీ వైవాహిక జీవితం సమస్యలు ఎదురవుతాయి

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×