BigTV English

Jupiter Transit 2024: బృహస్పతి ప్రభావంతో 3 నెలలు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !

Jupiter Transit 2024: బృహస్పతి ప్రభావంతో 3 నెలలు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !

Jupiter Transit 2024:  బృహస్పతి తొమ్మిది గ్రహాలలో ఒకటి. సంవత్సరానికి ఒకసారి బృహస్పతి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. బృహస్పతి సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆత్మ విశ్వాసం, ధైర్యసహసాలు, సంపద, సౌభాగ్యం, సంతానం, వివాహానికి బృహస్పతి కారకుడిగా చెబుతారు. మే 1 న మేషరాశి నుంచి వృషభ రాశిలోకి బృహస్పతి రాశి మార్పు చెందాడు. అప్పటి నుంచి వృషభరాశిలోనే బృహస్పతి సంచరిస్తున్నాడు. 2025 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు.


ధనస్సు, మీన రాశులకు అధిపతిగా గురుడిని చెబుతారు. బృహస్పతి అన్ని రాశుల వారి కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. మూడు నెలలకు ఒకసారి తన నక్షత్ర స్థితిని బృహస్పతి మార్చుకుంటాడు. ఆగస్టు 20న బృహస్పతి మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబర్ 28 వరకు ఇదే నక్షత్రంలో పయనించనున్నాడు. గురు గ్రహం మృగశిర నక్షత్ర సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపినప్పటికీ కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకురానుంది. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
బృహస్పతి నక్షత్ర సంచారం మేష రాశి వారికి విజయాలను తెస్తుంది. మీకు ఈ సమయంలో అదృష్టం కలసివస్తుంది. అన్ని రంగాలలో మీరు విజయాలను సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు కూడా మీకు పెరుగుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కొత్త మిత్రులు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. సీనియర్లు పని చేసే చోట పూర్తి సహకారం అందిస్తారు. వ్యాపారంలో లాభాలు కూడా పొందుతారు.


వృషభ రాశి:
ఈ సమయంలో మీకు బాగుంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సలహాలను తీసుకోండి. మనోనివ్వరంతో ముందడుగు వేసి పనులను పూర్తి చేయండి . రవాణా శాఖలో పనిచేస్తున్న వారికి బాగుంటుంది. వ్యాపార నిమిత్తం కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త స్నేహాలు కూడా ఈ సమయంలో చిగురిస్తాయి. వినాయక దేవాలయాన్ని సందర్శించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

మిథున రాశి:
సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఇంట్లో వారికి నచ్చకపోయినా కొత్త కోర్సులు నేర్చుకోవాలనే భావన కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి అండదండలు లభించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆఫీసులో మీకు ప్రశంసలు లభిస్తాయి.

కర్కాటక రాశి:
ఈ వారు కొత్త పద్ధతుల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సమయమనం కోల్పోకండి. ఓర్పుతో మాట్లాడండి. ఇష్ట దేవుళ్ళకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. సోదరుల నుంచి మీకు ధన లాభం కలుగుతుంది. నూతన ఒప్పందాలు కూడా పరిష్కారం అవుతాయి. నిందారోపణలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితుల వల్ల కూడా ప్రయోజనాలను పొందుతారు. దీపారాధన చేయడం శుభప్రదం.

కన్య రాశి:
భూముల అమ్మకాల విషయంలో లాభాలు పొందుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు మీకు అనుకూలిస్తాయి. కీలకమని భావించిన విషయాల్లో తొందరపాటు వహించకండి .జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి . అష్టమూలికా తైలంతో దీపారాధనలు చేయడం మంచిది. మీ ఆటంకాలు తొలగిపోతాయి. కాళ్లకు చక్రాలు కట్టుకొని మరి మీరు పని చేస్తారు. మంచి విషయాల గురించి సమయం ఉపయోగించండి. కాలక్షేపం చేసేవారు మీకు నచ్చరు. రహస్య మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×