BigTV English

HYDRA: సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం ఇప్పటికైనా అర్థమైందా?: జనసేన

HYDRA: సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం ఇప్పటికైనా అర్థమైందా?: జనసేన

Janasena: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖతర్నాక్ నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వేరే రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయంపై ఆలోచనలు చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, కుంటలు, నాలాలు, చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను వేగంగా నేలమట్టం చేస్తున్నారు. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను కాపాడితేనే రాజధాని నగరం వరదల బారిన పడదని సీఎం స్పష్టం చేశారు.


హైడ్రా వేగంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకుపోతున్నది. ఈ తీరుపై మెజార్టీ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. కొందరు మాత్రం హైడ్రాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే హైడ్రాను తెచ్చారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. హైడ్రాకు రాష్ట్ర ప్రజల నుంచి మద్దతు రావడమే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ లభిస్తున్నది. తాజాగా, జనసేన హైడ్రా ఏర్పాటును సమర్థించింది.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు భారీ వర్షాలు, వీటి వల్ల రోడ్లు, ఇళ్లు నీటమునిగిపోతున్న తరుణంలో హైడ్రాను ప్రస్తావించారు. వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు, నాలాలు ఉప్పొంగి పోయి అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా వరదలకు బలికావడం చాలా బాధాకరమైన ఘటనలు అని అభిప్రాయపడ్డారు. అయితే, వీటికి ప్రధాన కారణం మాత్రం చెరువులను, నాలాలను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమేనని వివరించారు.


Also Read: Vande Bharat Sleeper Trains: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేసింది.. దిమ్మదిరిగే ఫీచర్స్ ఇవే

అలాంటి వాటిని కూల్చడానికే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అర్థమైందా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా కాన్సెప్ట్? అంటూ ట్వీట్
చేశారు. ఆయన సాహసోపేత నిర్మాణాలు తీసుకోవడం, మంచి పురోగతి సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపించారు. ‘మీకు మా సంపూర్ణ మద్దతు’ అని నాగబాబు స్పష్టం చేశారు. ‘పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్తిస్తే అది కూడా కచ్చితంగా మనలను శిక్షిస్తుందని తెలిపారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×