BigTV English

Pasvik Yog Effects: జులై 12 నుంచి ఈ రాశుల వారి జీవితంలో అడుగడుగునా ఇబ్బందులు

Pasvik Yog Effects: జులై 12 నుంచి ఈ రాశుల వారి జీవితంలో అడుగడుగునా ఇబ్బందులు

Pasvik Yog Effects: అంగారకుడు 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. జులై 12న కుజుడు, మేషరాశిని వీడి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగిస్తే మరికొందరికి బాధలను, కష్టాలను కలిగిస్తుంది. కుజుడి సంచారం వల్ల అశుభకరమైన పాశ్విక్ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని శుభ యోగంగా పరిగణించరు. ఇది మానవ జీవితాన్నిఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. ఏ రాశుల వారికి పాశ్విక్ యోగం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మిథున రాశి:
పాశ్విక్ యోగం వల్ల మిథున రాశి వారికి అశుభ పరిణామాలను కలిగుతాయి. ఈ సమయంలో కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశముంది. అందుకే ఓపికగా ఉండాలి. తల్లిదండ్రులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. చాలా వరకు ఆందోళనను తగ్గించుకోవాలి. ఈ సమయంలో ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒకటి తర్వాత ఒకటిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి:
కన్యా రాశి పదో ఇంట్లో కుజుడి సంచారం జరుగుతుంది. అందువల్ల పాశ్విక్ యోగం వీరికి వీరికి కష్టాలను కలిగిస్తుంది. ఈ కారణంగా వివాహితులు వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో అనవసర విషయాల్లో వాదనకు దిగుతారు. పరిస్థితి అదుపు చేయలేకపోతే వైవాహిక బంధం కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని మీ విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి
ధనస్సు రాశి:
ధనస్సు రాశి ఆరవ ఇంట్లో అంగారకుడి సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి పాశ్విక్ యోగం కలసిరాదు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. వాటిని అధిగమించేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఆఫీసుల్లో సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో విభేదాలు వస్తాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో జాగ్రత్త అవసరం. దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. భాగస్వామితో కొన్ని విషయాల గురించి వాదనలు జరుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. భృతి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుజుడిని బలపరిచే మార్గాలు:
జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే మంగళవారం స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. కుజుడికి సంబంధించిన మంత్రాలను మూడు లేదా ఐదు లేదా ఏడు సార్లు జపించాలి. మంగళవారం ఉపవాసం అంగారకుడి స్థానాన్ని బలపరుస్తుంది. కుజుడు బలహీనంగా ఉంటే మంగళవారం రోజు హనుమాన్ ను పూజించడం మంచిది.


Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×