E-Paper
Advertisement

Lucky Zodiac Signs: నవంబర్‌లో 4 గ్రహాల సంచారం.. ఈ రాశుల జీవితాలు మారిపోనున్నాయ్

Lucky Zodiac Signs: నవంబర్‌లో 4 గ్రహాల సంచారం.. ఈ రాశుల జీవితాలు మారిపోనున్నాయ్

Lucky Zodiac Signs: నవంబర్ నెల గ్రహాలు, నక్షత్రాల సంచారం కారణంగా ప్రత్యేకతను కలిగి ఉంది. ముఖ్యంగా నవంబర్ లో అనేక ప్రధాన గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటున్నాయి. ఈ గ్రహాల సంచారం 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి ఈ నెలలో శుభ ఫలితాలను ఇస్తే మరి కొందరికి సమస్యలను తెచ్చిపెడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్‌లో సూర్యుడు, గురు, శుక్ర, బుధ గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల ప్రభావం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. నవంబర్‌లో గ్రహ స్థానాల మార్పు వల్ల ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1.గురు నక్షత్ర సంచారం: దేవగురువు బృహస్పతి మృగశిర నక్షత్రాన్ని వదిలి నవంబర్ 28న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. గురుడి నక్షత్ర సంచారం నవంబర్ 28న మధ్యాహ్నం 01:10 గంటలకు జరుగుతుంది. బృహస్పతి రాశి మార్పు కారణంగా మేషం, మిథునం, వృశ్చికం మరియు ధనుస్సు రాశుల వారికి మంచి జరుగుతుంది.ఈ సమయంలో మీరు ఆర్థిక పురోగతిని పొందే సూచనలు ఉన్నాయి.

2. బుధుడి సంచారం: గ్రహాల రాకుమారుడైన బుధుడు నవంబర్ 26న వృశ్చిక రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఈ సంచారం ఉదయం 07:40 గంటలకు జరుగుతుంది. కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీనం రాశులపై బుధుడు అత్యధిక ప్రభావాన్ని చూపనున్నాడు. నవంబర్ 30న బుధుడు వృశ్చికరాశిలో బుధుడు అస్తమిస్తాడు. బుధుడి ప్రభావం మేషం, సింహం, ధనుస్సు, వృశ్చికం రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశుల వారు ఈ సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు.

3. శుక్రుడు రాశి మార్పు: నవంబర్ 7, 2024 గురువారం తెల్లవారుజామున 03:39 గంటలకు శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషం, వృషభం, సింహం, తులం, మకరం, కుంభం, మీనం రాశుల వారికి శుక్రుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: భారతదేశంలోని ధనిక దేవాలయాలు ఇవే.. సంపద తెలిస్తే ఆశ్చర్యపోతారు

4.సూర్య సంచారం: సూర్యుడు 16 నవంబర్ 2024 ఉదయం 07:41 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వారికి సూర్యుని సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ కాలంలో, మీరు ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలను పొందవచ్చు. నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. అంతే కాకుండా ఉన్నత స్ధానంలో  ఈ రాశుల వారు ఉండేందుకు సూర్యుడి సంచారం ఉపయోగిపడుతుంది.   సూర్యుడి సంచారం అధిక లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. ఈ రాశుల వారు శుభ కార్యాలు ప్రారంభించేందుకు ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు.

5. శని సంచారం : నవంబరులో శని తన రాశిని మార్చుకోదు. కానీ తన కదలికను మారుస్తుంది. ప్రస్తుతం శని గ్రహం తిరోగమనంలో కదులుతోంది. నవంబర్ 15వ తేదీన శని ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. శనిదేవుడు, న్యాయ దేవుడు, కర్మ ఫలితాలను ఇచ్చేవాడు. నవంబర్ 15 సాయంత్రం 05.11 గంటలకు తన మూలికోణ రాశిలో కుంభరాశిలో ప్రత్యక్షంగా ఉంటాడు. ఈ సంచారం కొన్ని గ్రహాలపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×