Big Stories

Falguna Ekadashi 2024: ఏప్రిల్ 5 న ఫాల్గుణ ఏకాదశి.. ఈ 4 రాశుల వారికి వరించనున్న అదృష్టం

- Advertisement -

Falguna Ekadashi on 5th April 2024: ఏప్రిల్ 5వ తేదీన ఫాల్గున ఏకాదశి రానుంది. ఈ తేదీలో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటే, రాశులు కేంద్ర స్థానంలో ఉంటాయట. అందువల్ల మహాపురుష యోగం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫాల్గుణ ఏకాదశి రోజు 4 రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టనుందని శాస్త్రం చెబుతుంది. మరి ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం..

- Advertisement -

1. మిథున రాశి..

మిథున రాశి వారికి ఏప్రిల్ 5వ తేదీన లక్ష్మీ దేవి వరించనుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రాశి వారు చేసే పనుల్లో ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాలలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారులు తమ బ్యాలెన్స్ షీట్‌ను అతి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక యువత అయితే ఎక్కువగా గొడవలు, తగాదాలు పెట్టుకోకూడదు. మితిమీరిన ఉత్సాహం మానుకుని.. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్టమైన దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే కలుగుతుంది.

2. కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి సాధారణ రోజు కంటే ఫాల్గుణ ఏకాదశి రోజు కొంత మానసిక ప్రశాంతత లభించనుంది. ఈ రాశి వారు చేసే ఏ పనులైనా సఫలమే అవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కర్కాటక రాశి వారు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకు ప్రయత్నాలు చేస్తారు. ఆటల్లో దిట్ట అయిన యువత తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. అన్ని ఆటల్లోను గెలుపు సాధిస్తారు. చదువులోను వీరికి మంచి యోగం ఉండబోతుంది. భార్య, తల్లి ఆరోగ్యాల పట్ల జాగ్రత్త వహించాలి. మానసికంగా దృఢంగా ఉండి.. నిస్పృహ పరిస్థితులు ఎదుర్కోవాలి. వీరు ఆంజనేయస్వామిని పూజించడం ద్వారా కాస్త మనో దైర్యాన్ని పొందుతారు.

Also Read: చెట్టుమానులో ఆంజనేయస్వామి ఆలయం..! ఎక్కడో తెలుసా?

3. ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు అయితే దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలోని విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధ వహించాలి. ఏది తనంతటే అదే విజయం తీసుకురాదు. అందులో మన కృషి కూడా ఉండాలి. యువత మత్తు పానీయాలకు బానిసలు కాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడాలి. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోండి.

4. మకర రాశి..

మకర రాశి వారు సంపాదనపై శ్రద్ధ వహిస్తే వీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఫైనాన్స్‌కు సంబంధించిన లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. రుణాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. యువత పెద్దలను గౌరవించడం, పిల్లల పట్ల సానుభూతి, వివాదాలకు దూరంగా ఉండడం, శ్రద్ధగా చదుకోవడం వంటివి చేయడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబ సమేతంగా దైవదర్శనాలు చేసుకోవడం మంచిది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూనే, దుర్గాదేవిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News