Big Stories

Saturday Shani Dev Worship: శనిదేవుడి పూజా విధానం.. శనివారం ఇలా పూజిస్తే ఐశ్వర్యం పొందుతారు!

- Advertisement -

Shani Dev Worship Process: సాధారణంగా శనిదేవుడి పేరు వినగానే చాలా మంది భయాందోళనకు గురవుతారు. మన జాతకాల్లో, మన కుటుంబ సభ్యులు, పిల్లల జాతకాల్లో ఎటువంటి శని, శుక్ర దోశాలు ఉండకూడదని ఆందోళన చెందుతుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పేర్లు వింటేనే భయపడతారు.. కానీ శనిదేవుడిని ఇలా పూజిస్తే.. ఆయన ప్రసాదించే వాటి గురించి తెలిస్తే తప్పక శనీశ్వరుడిని ఆరాధిస్తారు.

- Advertisement -

శనీశ్వరుడి పవర్ ఫుల్ మంత్రాన్ని మనసులో అనుకుని జపించడం ద్వారా సర్వదోశాలు పోతాయట. శనీశ్వరుడి మంత్రాన్ని జపించడం ద్వారా తప్పక అనుగ్రహిస్తాడట. ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం.

‘నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం’అంటారు.

నీలాంజనం అంటే.. నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు అని అర్థం.
రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు,
యమాగ్రజం-యముడికి సోదరుడు,
ఛాయా మార్తాండ సంభూతం.. ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు,
తం నమామి శనేశ్చరం.. అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం.
ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని తప్పక అనుగ్రహిస్తాడని పండితులు చెబుతుంటారు.

Also Read: ఏప్రిల్ 5 న ఫాల్గుణ ఏకాదశి.. ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి వరించనుంది

శనీశ్వరుడిని శని అని కాకుండా శనీశ్వరా అని పలకాలి. ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుందని అంటారు. శనీశ్వరుడి పేరులో శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడం వల్ల శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతుంటాయి. అందరూ శనీశ్వరుడికి భయపడుతుంటారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతీ ఆలయంలో ఉండే నవగ్రహ మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి నమస్కారం చేసి.. శనివార నియమాల్ని పాటించాలి. నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని మాత్రమే ధరించాలి.

ప్రతీ దేవుడిని ఎలా అయితే పూజిస్తామో శనీశ్వరుడిని కూడా గౌరవంగా, భక్తితో పూజించాలి. కొద్దిగా శనీశ్వరుడు పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ అందించి వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం లేకపోతే యోగం, ఐశ్వర్యం రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీకలిగించాలని కోరుకోవాలట. శనీశ్వరుడిని నీలిరంగు పువ్వులతో పూజించాలి. శనివార నియమాల్ని పాటిస్తే కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News