Big Stories

Sri Maddi Anjaneya Swamy Temple: చెట్టుమానులో ఆంజనేయస్వామి ఆలయం..! ఎక్కడో తెలుసా..?

Sri Maddi Anjaneya Swamy Temple History

- Advertisement -

Sri Maddi Anjaneya Swamy Temple History & Significance: ఆంజనేయ స్వామి పేరు వినగానే మనసులోని అన్ని భయాలు దూరమవుతాయి. తనను నమ్మిన భక్తుల భయాలను దూరం చేసి, విజయాలను అందించే ఆంజనేయుడు అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. అయితే.. చెట్టుమానులో ఆంజనేయస్వామి కొలువై ఉన్న ఓ అరుదైన ఆలయం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం మండలంలోని గురవాయి గూడెంలో ఉంది.

- Advertisement -

స్థలపురాణం ప్రకారం, త్రేతాయుగంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. పేరుకు రాక్షసుడే అయినా, ‘జీవహింస చేయను, కత్తిపట్టను’ అనే నియమం మీద జీవించేవాడు. సీతమ్మ జాడకై హనుమ లంకకు వచ్చినప్పుడు అతని వ్యక్తిత్వం చూసి, భక్తుడిగా మారాడు. రామ రావణ యుద్ధంలో ఆ యుద్ధంలో రాముడి ‘హనుమా.. హనుమా’ అంటూ ఆత్మత్యాగం కన్నుమూశాడు. అతడే ద్వాపర యుగంలో ‘మధ్వికుడు’ అనే పేరుతో జన్మించి కౌరవుల పక్షాన పోరాడాడు. అప్పడు కూడా అర్జునుడి జెండా మీద ఆంజనేయుడిని చూసి గత జన్మస్మృతిని పొంది ఆంజనేయుడిని స్మరిస్తూనే కన్నుమూశాడు.

అతడే కలియుగంలో ‘మధ్యుడు’ అనే పేరుతో జన్మించి హనుమ గురించి తపస్సు చేసుకుంటూ అనేక ప్రదేశాలు తిరుగుతూ నేటి గురవాయి గూడెం వద్ద గల ఎర్రకాలువ ఒడ్డున నివాసం ఏర్పరుచుకుని, తపస్సు చేశాడు. ముసలితనంలో ఓరోజు స్నానం చేసి వచ్చే వేళ ఎండకు సొమ్మసిల్లి పడిపోగా ఆంజనేయుడు కోతి రూపంలో వచ్చి పండు ఇచ్చి తినిపిస్తాడు. తర్వాత తన భక్తుడికి నిజరూపంలో దర్శనమివ్వగా, నీతోనే శాశ్వతంగా ఉండేలా వరం కావాలని మధ్యుడు కోరతాడు. ‘నీవు మద్దిచెట్టుగా మారు. నేను నీ కిందే కొలువై ఉండిపోతాను’ అని హనుమ వాగ్దానం చేయగా, నాటి నుంచి నేటి వరకు స్వామి ఆ చెట్టుకిందే నిలబడిపోయారు.

Also Read: చైత్ర నవరాత్రులు.. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగం..

దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలోని స్వామి ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు. అలాగే శిఖరం లేని ఈ ఆలయానికి తెల్ల మద్ది చెట్టే నేటికీ శిఖరంగా ఉంది. క్రీ.శ. 1166లో స్థానికులకు ఇక్కడ దర్శనమివ్వగా అక్కడ ఒక చిన్న గుడిని నిర్మించారు. 1978లో దానిని విస్తరించి అభివృద్ధి చేసినా, ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు. ప్రతి మంగళవారం వేలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. వైష్ణవ సంప్రదాయంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామికి కల్యాణం నిర్వహిస్తారు. ఏటా వేలాది మంది ఇక్కడ హనుమత్ దీక్షలు తీసుకుంటారు.

శని, కుజ, రాహు గ్రహదోషాలున్న వారు ఇక్కడ శనివారం పూజచేయించుకుంటే అవి తొలగిపోతాయని, ఈ ఆలయంలో 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసిన వారి కోరిక తప్పక తీరుతుందని స్థానికుల నమ్మకం. ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులు.. ఆలయానికి 4 కి.మీ దూరంలో జంగారెడ్డిగూడెంలో భాగంగా ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రాన్ని సందర్శించి, అక్కడి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామినీ దర్శించుకుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News