BigTV English

Samsaptak Yoga: సంసప్తక యోగ ప్రభావం.. తండ్రీకొడుకులపై చెడు దృష్టి

Samsaptak Yoga: సంసప్తక యోగ ప్రభావం.. తండ్రీకొడుకులపై చెడు దృష్టి

Samsaptak Yoga: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తుంటారు. శని గ్రహాన్ని న్యాయనిర్ణేతగా చెబుతుంటారు. శని, సూర్యుడి మధ్య తండ్రీ, కొడుకుల సంబంధం ఉంటుంది. ఇది మాత్రమే కాదు హిందూ గ్రంధాల ప్రకారం శని, సూర్యుడి మధ్య శత్రత్వ భావన కూడా ఉంది. ప్రస్తుతం శని మూల త్రికోణ రాశిలో ఉన్న కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 16న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.


సెప్టెంబర్ 15 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. సంవత్సరం తర్వాత సూర్యుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు శనితో సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఏడవ గృహంలో ఈ రెండు గ్రహాలు ఎదురుగా రావడం వల్ల ఈ యోగం ఏర్పడనుంది. సూర్యుడు, శని ఇవ్వబోతున్న ఈ యోగం అశుభకరమైనదిగా పరిగణిస్తారు.

సూర్యుడు, శని ముఖాముఖి:
సింహ రాశి సంచారంతో సూర్యుడు, శని గ్రహాలు ముఖాముఖిగా ఉంటాయి. అంటే అవి ఒకదానికొకటి 180 డిగ్రీల వద్ద కలుసుకుంటాయి. సూర్యుడు, శని ప్రభావం వల్ల మేషరాశితో సహా కొన్ని రాశుల వారి జీవితాల్లో కల్లోలం ఏర్పడుతుంది. ఫలితవంగా కొన్ని రాశుల వారు వృతిలో ఆర్థిక నష్టాన్ని, పనుల్లో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. శని, సూర్యుడు కలిసి ఏ రాశుల వారికి ఒత్తిడిని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
సూర్యుడు, శని గ్రహాల వల్ల ఏర్పడే సంసప్తకయోగం మేష రాశి వారికి అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. ఈ కాలంలో డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. వృత్తి జీవితంలో సంక్షోభం ఏర్పడుతుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆచి తూచి డబ్బులు ఖర్చు పెట్టడం మంచిది.

సింహ రాశి:
సూర్యుడు, శని క్రూర దృష్టి సింహ రాశి వారికి కష్టాలను కలిగిస్తుంది. ఈ కాలంలో మీ సంబంధాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పనిచేసే చోట జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి. లేదంటే అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కెరీర్ పరంగా మీకు ఈ సమయం అనుకూలంగా లేదు.

కన్య రాశి:
సూర్యుడు, శని కారణంగా కన్య రాశి వారికి సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో శాంతి పెరుగుతుంది. సంబంధాలు కూడా క్లిష్టంగా మారతాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. ఈ కాలంలో ఏ నిర్ణయాలైనా చాలా ఆలోచించి తీసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి శని, సూర్యుల సంసప్తక యోగం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఎదురుకావచ్చు.

Also Read: వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్భుతమైన ముహూర్తం ఇదే..

మకర రాశి:
సూర్యుడు, శని గ్రహాల అంశం మకర రాశి వారికి కూడా శుభప్రదం కాదు. ఈ కాలంలో మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే సంకేతాలు ఉన్నాయి. మీకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో కూడా నష్టం కలుగుంది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×