BigTV English

Varalakshmi Vratham Pooja Time : వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్భుతమైన ముహూర్తం ఇదే..

Varalakshmi Vratham Pooja Time : వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్భుతమైన ముహూర్తం ఇదే..

Varalakshmi Vratham Pooja Procedure : ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం చేసుకోబోతున్నారు. ఈ మాసంలో ఉన్న వ్రతాలు, నోముల్లో వరలక్ష్మీ వ్రతంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. వివాహితలు అంతా కలిసి అమ్మవారిని అలంకరించి ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది జరుపుకోబోయే వరలక్ష్మీ వ్రతం శుభ ముహుర్తం ఎప్పుడు అనేది చాలా మందికి సందేహంగా ఉంది. అయితే ఏ సమయంలో చేసుకుంటే మంచిది, పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


శుభ సమయం..

వరలక్ష్మీ వ్రతానికి ఈ ఏడాది అద్భుతమైన సమయం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై వివాహితలకు వరాలు ఇస్తుందట. అయితే ఆ సమయాలు ఏంటో తెలుసుకుందాం.


సింహ లగ్నం

పూజ ముహూర్తం ఉదయం 5:57 నిమిషాల నుంచి, 8:14 నిమిషాల వరకు ఉంది. వ్యవధి 2: 17 నిమిషాలు ఉండనుంది.

వృశ్చిక లగ్నం

పూజ ముహూర్తం మధ్యాహ్నం 12: 50 నిమిషాల నుంచి, 3: 8 నిమిషాల వరకు ఉంది. వ్యవధి 2: 19 నిమిషాలు ఉండనుంది.

కుంభ లగ్నం

పూజ ముహూర్తం సాయంత్రం 6: 55 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8: 22 వరకు ఉంటుంది. వ్యవధి గంట 27 నిమిషాలు ఉంటుంది.

వృషభ లగ్నం

పూజ ముహూర్తం అర్ధరాత్రి 11: 22 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1:18 నిమిషాల వరకు ఉంటుంది. వ్యవధి గంట 56 నిమిషాలు ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×